Annaatthe: సూపర్ సార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నతే… ఈ మూవీకోసం తలైవా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేశారు. ఆ పనుల మీద రజనీ బిజీ అవ్వడంతో ఈ సినిమాను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రజనీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నారు. తిరిగి సినిమాను మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టారో లేదో కరోనా కల్లోలం మొదలైంది. నిబంధనలు పాటిస్తూ షూటింగ్ కానిచ్చేదం అనుకున్నా.. సెట్లో కొందరికి కరోనా వచ్చింది. దాంతో సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టి చకచకా కనిచేస్తున్నారు.
శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. తాజాగా సినిమానుంచి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్లో తలైవా పంచకట్టుకొని స్టైల్‌గా నిలుచొని నవ్వుతూ కనిపిస్తున్నారు. దర్శకుడు శివ గత సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోవడంతోపాటు రికార్డ్‌లను కూడా క్రియేట్ చేసాయి. దాంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మరి అన్నతే ఏ రేంజ్‌లో విజయం సాధిస్తుందో చూడాలి.
#AnnaattheFirstLook is here.. @rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @khushsundar #Meena @sooriofficial @AntonyLRuben @dhilipaction @vetrivisuals#AnnaattheDeepavali pic.twitter.com/zu5HWbEF6N
— Ramesh Bala (@rameshlaus) September 10, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :