Sarkaru Vaari Paata: యూస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సూపర్ స్టార్.. ఓవర్సీస్‌లో సర్కారు వారి పాట నయా రికార్డ్

|

May 13, 2022 | 7:55 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా నిన్న ( ఈ నెల 12న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

Sarkaru Vaari Paata: యూస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సూపర్ స్టార్.. ఓవర్సీస్‌లో సర్కారు వారి పాట నయా రికార్డ్
Svp
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)సినిమా నిన్న ( ఈ నెల 12న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. మహేష్ బాబు స్టైల్ కు.. డైలాగ్ డెలివరీకి.. నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పోకిరి సినిమా తర్వాత మహేష్ మాస్ పాత్రలో నటించడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. సర్కారు వారి పాట మొదటి రోజే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు వసూల్ చేసింది ఈ మూవీ. ఇక మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే.  టాలీవుడ్ హీరోలందరికన్నా అక్కడ  రెట్టింపు ఇమేజ్  ఉంది మహేష్ కు.  అమెరికాలో మహేష్ సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతాయి. అంతకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ అక్కడ అదే స్థాయిలో జరుగుతుంది.

ఇక సర్కారు వారి పాట సినిమా కూడా ఇప్పుడు అదే రేంజ్ లో దూకుడు చూపిస్తోంది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న సర్కారు వారి పాట భారీ ఓపినింగ్స్ రాబట్టింది. ఓవర్సీస్ లో తెలుగు రీజినల్ మూవీస్ లలో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసిన ‘సర్కారు వారి పాట’..  ప్రీమియర్ షో కలెక్షన్లతో సరికొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఒక్క ప్రీమియర్ నుంచే $ 925 కె వసూళ్లతో సంచలనం సృష్టించింది. గురువారం ఒక్కరోజే ప్రీ సేల్స్ తో వన్ మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది.అమెరికా మార్కెట్ లో మహేష్ ఏకంగా పదిసార్లు మిలియన్ డాలర్ల ఏకైక స్టార్ గా నిరూపించుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్