Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్ వచ్చేది అప్పుడే..

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమాకోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట సెకండ్ సాంగ్ వచ్చేది అప్పుడే..
Mahesh Babu

Edited By: Janardhan Veluru

Updated on: Mar 17, 2022 | 2:54 PM

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట‘ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన పోకిరి సినిమాకు ఏమాత్రం తగ్గదని ఆ మధ్య మహేష్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి . ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ , టీజర్ రీసెంట్ గా వచ్చిన కళావతి పాట ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఎప్పుడు.. ఎప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని ఫ్యాన్స్ ఉర్రుతలూగుతున్నారు. ఇప్పటికే కళావతి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పటివరకు 90 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ లవ్లీ సాంగ్. ఇప్పటివరకు విడుదలైన తెలుగు మూవీ ఫస్ట్ సింగిల్స్ లో తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న సాంగ్ గా కళావతి రికార్డ్ క్రియెట్ చేసింది. ఇప్పుడు ఇదే ఊపులో మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్.

సర్కారు వారి పాట సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ‘పెన్నీ’ అనే పాటను మార్చి 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ పోస్టర్ ని వదిలారు. ఈ పోస్టర్ లో మహేష్ ఎప్పటిలానే సూపర్ స్టైల్ హ్యాండ్సమ్ లుక్ లో అదరగొట్టాడు. ‘పెన్నీ’ పాట ఎస్ఎస్ తమన్ మార్క్ కంపోజిషన్ తో మనీ గురించి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సర్కారు వారి పాట సినిమాను మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మహేష్ మరో సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Sarkaru Vaari Paata

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ఆ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మే నాకు స్ఫూర్తి.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. టికెట్స్ రేట్స్ విషయంపై..