Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ సింగిల్ రెడీ .. రిలీజ్ ఎప్పుడంటే..

|

Jan 26, 2022 | 12:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు.

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ సింగిల్ రెడీ .. రిలీజ్ ఎప్పుడంటే..
Sarkaru Vaari Paata
Follow us on

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతి పోస్టర్ సర్కారు వారి పాట పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది. ఇటీవల మహేష్ బాబు మోకాలి సర్జరీ జరగడం.. ఆ తర్వాత.. మహేష్.. కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక అటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ మూవీ వేసవికి వాయిదా పడింది.

ఈ సినిమా అప్డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి సంక్రాంతికి సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందేమో అనికున్నారు అంతా కానీ చిత్రయూనిట్ కరోనా బారిన పడటంతో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేక పోయారు. ఇక ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కు ముహూర్తం ఖరారైంది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తమన్ పై ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇక సమ్మర్ లో ఈ సినిమా రాబోతుంది. ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకరించారు చిత్రయూనిట్ . కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

Padma Awards 2022: పద్మ అవార్డులకు ఎంపికైన వారిపై మెగాస్టార్‌ చిరంజీవి ఏమన్నారంటే..!

Dilraju: ఆ సమయంలో డిప్రెషన్‏లో వెళ్లాను.. సినిమాలే నిలబెట్టాయి.. నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్.