సూపర్ స్టార్ రజినీకాంత్ అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు రజినీకాంత్. కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో రజినీ నిజంగానే సూపర్ స్టార్. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తలైవా. సినీ కళామతల్లికి రజినీ అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈరోజు (అక్టోబర్ 25న) ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా రజనీ కాంత్ అవార్డు అందుకోకున్నారు..
ఇదిలా ఉంటే… ఈరోజు రజినీ జీవితంలో చాలా స్పెషల్.. ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్ట్ రావడం..మరొకటి.. రజినీ కూతురు సౌందర్య విశాగన్ తను సొంతంగా రూపొందించిన Hoote యాప్ ప్రారంభించబోతుంది. ఇందులో ప్రజలు వారి వాయిస్ ద్వారా ఆలోచనలను పంచుకోవచ్చు. అయితే ముందుగా ఈ యాప్ రజినీ వాయిస్‌తో ప్రారంభిస్తున్నారు. అందుకే ఈ ఈరోజు రజినీ జీవితంలో చాలా ప్రత్యేకం.. అయితే నిన్న ఢిల్లీకి బయలుదేరే ముందు రజినీకాంత్ తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు.. ప్రజల ప్రేమ అభిమానం వల్ల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కిందని తెలిపారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉన్నా.. ఈ సమయంలో తన గురువు కె. బాలచందర్ లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు.
???? pic.twitter.com/vkTf6mxYUu
— Rajinikanth (@rajinikanth) October 24, 2021
ALSO READ: ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్..
Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..
RRR Update: ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్.. ఆర్.ఆర్.ఆర్ టీజర్ వచ్చేది అప్పుడేనా.?
Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..