Mahesh Babu: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ‘గుంటూరు కారం’ సందడి.. మహేష్ బాబు భారీ కటౌట్ అదిరిపోయిందిగా..

2021లో ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసినా.. షూటింగ్ మాత్రం నిదానంగా జరుగుతుంది వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు వచ్చే ఏడాది 2024 జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇటు కొద్దిరోజులుగా మూవీ ప్రమోషన్స్ కోసం ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం గుంటూరు కారం నుంచి కుర్చి మడతపెట్టి సాంగ్ రిలీజ్ చేయగా.. యూట్యూబ్‍లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే సమయంలో అటు ఈ పాటపై విమర్శలు సైతం వస్తున్నాయి.

Mahesh Babu: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన 'గుంటూరు కారం' సందడి.. మహేష్ బాబు భారీ కటౌట్ అదిరిపోయిందిగా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 30, 2023 | 6:54 AM

మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుడంగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2021లో ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసినా.. షూటింగ్ మాత్రం నిదానంగా జరుగుతుంది వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు వచ్చే ఏడాది 2024 జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇటు కొద్దిరోజులుగా మూవీ ప్రమోషన్స్ కోసం ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం గుంటూరు కారం నుంచి కుర్చి మడతపెట్టి సాంగ్ రిలీజ్ చేయగా.. యూట్యూబ్‍లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే సమయంలో అటు ఈ పాటపై విమర్శలు సైతం వస్తున్నాయి. మహేష్ రేంజ్ ఏంటీ ?.. ఆ సాంగ్ ఏంటీ ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మూడోసారి త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం సినిమా అడియన్స్ ముందుకు రావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సందడి మొదలైంది.

తాజాగా సోషల్ మీడియాలో మహేష్ బాబు భారీ కటౌట్ ఫోటో వైరలవుతుంది. ఆంధ్రప్రదేశ్‏లోని రాజమండ్రి అప్సర థియేటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కటౌట్ ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. గుంటూరు కారం సెలబ్రెషన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ పూర్తిగా మాస్ లుక్ లో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.