Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాకు మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా ?..

|

Jul 12, 2022 | 1:04 PM

ఇక ఇప్పుడు ఫిల్మ్ నగర్లో మహేష్ బాబు రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ ఏకంగా

Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాకు మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా ?..
Mahesh Babu
Follow us on

ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu) కుటుంబంతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు మహేష్. బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆగస్ట్ మొదటి వారంలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఫిల్మ్ నగర్లో మహేష్ బాబు రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ ఏకంగా రూ. 70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ రూ. 60 కోట్లు తీసుకున్నాడని.. ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఈ మూవీతోపాటు.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలోనూ మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అనంతరం రాజమౌళి, మహేష్ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్ఎస్ఎంబీ 28లో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.