Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB28 షూటింగ్ రీ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే..

|

Dec 11, 2022 | 8:02 AM

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 12ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది.

Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB28 షూటింగ్ రీ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే..
Mahesh Babu, Trivikram
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 12ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే మహేష్ సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఓ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించట. అయితే ఇంతలోనే మహేష్ తల్లిగారు ఇందిరాదేవి కన్నుమూయడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. లాగ్ హెయిర్, గడ్డంతో రఫ్ గా కనిపించనున్నారు మహేష్. ఇప్పటికే మహేష్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాకోసం మహేష్ లుక్ చేంజ్ చేశాడట. అంతే కాదు బరువు కూడా తగ్గాడట మహేష్. అంతే కాదు సిక్స్ ప్యాక్ ఉండేలా బాడీని డవలప్  చేశాడట. ఇప్పుడు తల్లిపోయిన బాధలో ఉన్న మహేష్ ఈ మూవీ షూటింగ్ కు ఎప్పుడు హాజరవుతారన్నది ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర చర్చగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ జనవరి నుంచి తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను 2023సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేస్తామని మందే అనౌన్స్ చేశారు మేకర్స్. దాంతో జనవరి నుంచి శరవేగంగా షూటింగ్ జరపనున్నారు. తాజాగా ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు మహేష్ బాబుతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. అలాగే నాన్  స్టాప్ షూటింగ్ చేయనున్నాం.. అప్డేట్స్ వరుసగా వస్తాయి అని రాసుకొచ్చారు మేకర్స్. అయితే ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేసే  ఛాన్స్ ఉందని అంటున్నారు కొందరు అభిమానులు. మరి ఆ అప్డేట్స్ ఏంటో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..