ప్రతి వ్యక్తికీ బాల్యం ఎంత అపురూపమో… చదువుకునే రోజుల్లో ఏర్పడిన స్నేహం కూడా అంతే అపురూపం ఎవరికైనా.. స్కూల్ తో మొదలైన స్నేహాన్ని.. జీవితాంతం కొనసాగించేవారు కూడా ఉన్నారు. అలాంటి స్నేహితుల్లో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ, సినీ యాక్టర్ మురళీ మోహన్. ఇటీవల కృష్ణ మరణంతో ఆయన జీవిత విశేషాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. బాల్యం, చదువు, నటనపై ఆసక్తి, వెండి తెరపై అడుగు ఇలా అన్ని సందర్భాలను సినీ పరిశ్రమతో పాటు స్నేహితులు, సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఘట్టమనేని శివరామకృష్ణతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆయనతో ఉన్న పరిచయాన్ని సాన్నిత్యాన్ని వెల్లడిస్తున్నారు. అంతేకాదు.. కృష్ణతో ఉన్న తమ జ్ఞాపకాలను కొంత మంది వ్యక్తులు ఫోటోల రూపం లో ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ వైరల్ పిక్ లో బుర్రిపాలెం బుల్లోడు.. సీనియర్ నటుడు మురళి మోహన్ లు ఉన్నారు. వీరిద్దరూ డిగ్రీ చదివే సమయంలో క్లాస్ మేట్స్. 1958-60 మధ్య ఏలూరులోని డాక్టర్ సి ఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. అప్పుడు తీసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే.. మురళీ మోహన్, కృష్ణ ఇద్దరూ సినీ పరిశ్రమలో హీరోలుగా అడుగు పెట్టి.. తమదైన శైలిలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు. నటులుగా, నిర్మాతలుగా టాలీవుడ్ లో తమకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. చదువుకునే రోజుల్లో మొదలైన కృష్ణ, మురళీ మోహన్ ల స్నేహం.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. మురళీ మోహన్ జయభేరి ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి.. తన బ్యానర్ లో సూపర్ కృష్ణ, మహేష్ బాబులతో కూడా సినిమాలను నిర్మించారు. కృష్ణను మహాప్రస్థానికి తీసుకుని వెళ్లే సమయంలో తన ఆప్తమిత్రుడికి తుది వీడ్కోలు పలుకుతూ.. పాడెను మోశారు మురళీ మోహన్. స్నేహం అంటే చందనం చెక్క వంటిది మరి.. ఎంత అరగదీసినా దాని సువాసన పోనట్లు.. స్నేహం ఎంత పాతబడినా .. దాని విలువ మారదు అని అంటారు.. అందుకనే 60 ఏళ్ల నాటి ఫోటో నేటికీ వీరిద్దరి బంధాన్ని అనుబందానికి గుర్తుగా మారింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..