Super Over in Aha: రీసెంట్ రిలీజ్ ‘సూపర్ ఓవర్’తో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ‘ఆహా’ యాప్. అచ్చమైన తెలుగు ఓటీటీగా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ క్వాలిటీ పరంగా బెస్ట్ అనిపించుకుంటుంది. అంతేకాదు సక్సెస్ ఫుల్ సినిమాలతో రోజురోజుకి టాలీవుడ్ ఆడియన్స్‌కు మరింత చేరువవుతోంది. ‘భానుమతి రామకృష్ణ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ లాంటి యూత్ ఫుల్ కంటెంట్‌తో సక్సెస్ కొట్టిన ‘ఆహా’ ఇప్పుడు అన్ని జానర్‌లలోనూ ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తోంది.
‘ఆహా’ యాప్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ‘కలర్ ఫోటో’ ఒకటి. హార్ట్ టచింగ్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ మూవీ.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్‌లో సక్సెస్ సాధించింది. ఈ జోష్‌తో మరింత మంచి కంటెంట్‌ను ఆడియన్స్‌కు అందించే దిశగా దూసుకుపోతోంది ‘ఆహా’.
ఇటీవల ‘కంబాలపల్లి కథలు’ అనే వెబ్ సిరీస్‌లో భాగంగా రిలీజ్ చేసిన ‘మెయిల్’కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. నాస్టాలజిక్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సిరీస్ ‘ఆహా’కు తెలుగు ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అయ్యేలా చేసింది. తాజాగా ‘సూపర్ ఓవర్’తో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది ‘ఆహా’.. ఈ మూవీకి సెలబ్రిటీల నుంచి పాటిటివ్ టాక్ వినిపిస్తోంది.
Also Read : Sandeep Reddy Vanga’s ‘Animal’: మరింత రా అండ్ రస్టిక్‌గా ‘యానిమల్’..! సందీప్ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కు..?