Chandini Cries in PC:ప్రమాదంలో మరణించిన డైరెక్టర్‌ని గుర్తు చేసుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్లు

తమతో జర్నీ చేసిన వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. ఆ వ్యక్తి తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టడం సహజం.. ఈ ఘటన సూపర్ ఓవర్ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు...

Chandini Cries in PC:ప్రమాదంలో మరణించిన డైరెక్టర్‌ని గుర్తు చేసుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్లు
Follow us
Surya Kala

|

Updated on: Jan 23, 2021 | 2:01 PM

Chandini Cries in PC:తమతో జర్నీ చేసిన వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. ఆ వ్యక్తి తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టడం సహజం.. ఈ ఘటన సూపర్ ఓవర్ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చోటు చేసుకుంది. ఆ సినిమా హీరో, హీరోయిన్ , డైరెక్టర్ లు తీవ్ర భావోద్వేగానికి గురై క‌న్నీరు పెట్టుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్ స్టోరీతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ‘కలర్‌ఫొటో’ సినిమా హీరోయిన్ చాందినీ చౌదరి, యంగ్ హీరో నవీన్ ‌చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.

బెట్టింగ్‌ తో కుటుంబాలు ఎన్ని కష్టాలు పడ్తున్నాయి.. సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది తెలియజేస్తూ తెరక తెరకెక్కింది. ఈ సినిమాతో ప్రవీణ్ దర్శకుడిగా మారారు.ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నప్పుడు.. కారు ప్రమాదంలో దర్శకుడు ప్రవీణ్‌ కన్నుమూశారు. దీంతో మిగిలిన చిత్రాన్ని సుధీర్‌ వర్మ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో ప్రవీణ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాందినీ, నవీన్‌, దర్శకుడు సుధీర్‌ కన్నీరు పెట్టుకున్నారు.

‘సూపర్‌ ఓవర్‌’ ప్రేక్షకులందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను… ఇలాంటి ఒక మంచి సినిమాలో తనని భాగం చేసినందుకు ప్రవీణ్‌కు థ్యాంక్యూ. ఈ చిత్రాన్ని ప్రవీణ్‌కే అంకితం చేస్తున్నామని చెప్పింది. ప్రవీణ్ ఎక్కడ ఉన్నా సరే ఈ చిత్రాన్ని వీక్షించి సంతోషిస్తాడని అనుకుంటున్నానని చాందినీ కన్నీరు పెట్టుకుంది.

అనంతరం నటుడు నవీన్‌చంద్రా మాట్లాడుతూ..ప్రవీణ్ తో తమ షూటింగ్ జర్నీని గుర్తు చేసుకున్నారు. ప్రవీణ్‌వర్మ చాలా మంచి వ్యక్తి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని చెప్పాడు. ఆయన గురించి మాట్లాడడం కూడా కష్టంగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఒక మనిషి ఆశయాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను సుధీర్ పూర్తి చేశార‌ని చెప్పాడు. ఈ సందర్భంగా సుధీర్‌కు థ్యాంక్స్ చెప్పాడు. యన కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ నవీన్‌ భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు సుధీర్‌ వర్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రవీణ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. అయితే సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా ఓ యాక్సిడెంట్ లో మరణించారు.

Also Read: రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలపై సీఎం జగన్ ను త్వరలోనే కలుస్తా: జనసేనాని