Irrfan Khan’s Wife: మీ జీవిత చివరి అంకం త్వరగా ముగిసింది, సినిమా ఉన్నంత వరకూ మాతోనే ఉంటారన్న ఇర్ఫాన్ ఖాన్ భార్య

51 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ చిత్రం పాన్ సింగ్ తోమర్ ను ప్రదర్శించి ఆయనకు ఘన నివాళి అర్పించింది.

Irrfan Khan's Wife: మీ జీవిత చివరి అంకం త్వరగా ముగిసింది, సినిమా ఉన్నంత వరకూ మాతోనే ఉంటారన్న ఇర్ఫాన్ ఖాన్ భార్య
Follow us

|

Updated on: Jan 23, 2021 | 3:22 PM

Irrfan Khan’s wife : 51 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ చిత్రం పాన్ సింగ్ తోమర్ ను ప్రదర్శించి ఆయనకు ఘన నివాళి అర్పించింది. ఈ సినిమా పలు అవార్డు గెలుచుకున్న అథ్లెట్ జీవితం ఆధారంగా రూపొందించబడింది.అథ్లెట్ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును ఇందులో చూపించారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దార్ , ఇర్పాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సిక్దార్ తన భర్తతో గడిపిన అందమైన జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మా మధ్య లేరు.. కానీ జ్ఞాపకాలు మమ్మల్ని నడిపిస్తున్నాయంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఆయన జీవితం చివరి అంకం చాలా త్వరగా వచ్చింది.. అయితే తన జీవితాన్ని కుటుంబాన్ని, సమర్ధవంతంగా నడిపారు. మేము మిమ్మల్ని తలచుకుని గర్వపడుతున్నామన్నారు సుతాపా సిక్దార్. తనకు ఇంకా గుర్తు తన భర్త కళ్ళలో ఆయన కలలు కనిపించేవి.. కానీ అవి అర్ధాంతరంగా ముగిపోయాయి.. అయితే ఈరోజు ఈ ఫంక్షన్ లో తన భర్తకు ఇస్తున్న నివాళి ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు సుతాపా సిక్దార్. IFFI ప్రదర్సించడానికి ఎంచుకున్న ఈ సినిమా గురించి ఒక జాతి మొత్తం మాట్లాడుతుందన్నారు.

హాలీవుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ ఇలా అనేక భాషల్లో నటించి అత్యుత్తమ నటుడు ఇర్ఫాన్. ఆయన అరుదైన న్యూరోఎండోక్రిన్ ట్యూమర్, క్యాన్సర్ తో బాధపడుతూ.. ఏప్రిల్ 2020 లో ముంబైలో మరణించాడు.

Also Read: యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి ఎఫెక్టివ్‌గా పని చేసే సొరకాయ జ్యూస్ ..