AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య రోజు పిల్లలు పుడితే శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలుసుకోండి

Amavasya Child Birth: అమావాస్య రోజున పిల్లలు పుట్టడం గురించి అనేక అపోహలు నెలకొన్నాయి. చాలా మంది “చీకటి రోజే” కాబట్టి, జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని భయపడతారు. కానీ జ్యోతిష్య పండితులైనవారు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అశుభం కాదు. ఇది వేదాలు, పురాణాలలో ఎక్కడా ప్రస్తావించబడలేదు.

అమావాస్య రోజు పిల్లలు పుడితే శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలుసుకోండి
Amavasya child birth
Rajashekher G
|

Updated on: Feb 13, 2026 | 11:48 AM

Share

హిందూ సంప్రదాయంలో అమావాస్య తిథి ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది. ఈ రోజు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ప్రతికూల శక్తులు, సమస్యలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా అమావాస్య తిథికి ప్రత్యేకత ఉంది. ఈ రోజును పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు, ప్రత్యేక పూజలు, మౌన వ్రతాలకు అత్యంత పవిత్రమైన రోజు అని భావిస్తారు. కొన్ని అమావాస్యలు, ముఖ్యంగా ఆదివారంతో వచ్చే అమావాస్యలు, ప్రత్యేక యోగాలతో ఉండి ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రత్యేక పూజలు, పరిష్కారాలు అవసరమని చెబుతారు. కొన్ని నమ్మకాల ప్రకారం.. అమావాస్య రోజున ఆడ పిల్లలు, పౌర్ణమి రోజున మగ పిల్లలు పుట్టితే అదృష్టంగా ఉంటుందని చెప్పడం కూడా వినిపిస్తుంది. కానీ, మరో వైపు, కొందరు ఈ రోజున పిల్లలు పుట్టడం అంత మంచిది కాదని.. దోషం కలిగే అవకాశముందని చెబుతుంటారు.

అమవాస్య రోజు పిల్లలు పుడితే..

ఈ క్రమంలో, అమావాస్య రోజున పిల్లలు పుట్టడం గురించి అనేక అపోహలు నెలకొన్నాయి. చాలా మంది “చీకటి రోజే” కాబట్టి, జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని భయపడతారు. కానీ జ్యోతిష్య పండితులైనవారు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అశుభం కాదు. ఇది వేదాలు, పురాణాలలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఈ నమ్మకం కేవలం మధ్యతరగతి మూఢనమ్మకం మాత్రమే. అంతేగాక, జ్యోతిష్య శాస్త్రంలో తిథి దోషాలు ఉన్నా.. పూజలు, శాంతిపరిష్కారాలతో వీటిని సరిచేసుకోవచ్చని చెబుతారు. పిల్లల భవిష్యత్తు తిథి కన్నా వారి కర్మ, పెంపకం, సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది.

అమావాస్య రోజున పుట్టినవారికి ప్రత్యేక లక్షణాలు:

బలమైన ఆధ్యాత్మికత, లోతైన ఆలోచనలు, మంచి తెలివితేటలు సున్నితమైన భావోద్వేగం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పూర్వీకుల ఆశీస్సులు, ఆధ్యాత్మిక పూర్వజ్ఞానంతో నిండిన వ్యక్తిత్వం.. కానీ, తిథి వల్ల ఏదైనా దోషం ఉంటే, శివలింగానికి అభిషేకం, కాళీమాత పూజలు, దానధర్మాలు చేయడం చాలా శుభకరమని వేద జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అసలైన దోషం కాదు. అది కేవలం అపోహ. తల్లి, తండ్రుల శ్రద్ధ, మంచి సంస్కరాలు, ఆధ్యాత్మిక మార్గనిర్దేశం ముఖ్యమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)