తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపినా తాను తగ్గేదేలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తీసుకువచ్చే సమయంలో పోలీస్ వాన్లో నుంచి ‘పుష్ప’ స్టైల్లో సంకేతాలు చూపించారు.