Mazaka Movie Twitter Review : మజాకా మూవీ రివ్యూ.. సందీప్ కిషన్ మూవీ ఎలా ఉందంటే..

యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం మజాకా. డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమాలో రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. మన్మథుడు సినిమాతో తెలుగు వారి హృదయాల్లో చోటు సంపాదించుకున్న అన్షు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది.

Mazaka Movie Twitter Review : మజాకా మూవీ రివ్యూ.. సందీప్ కిషన్ మూవీ ఎలా ఉందంటే..
Mazaka Twitter Review

Updated on: Feb 26, 2025 | 7:22 AM

మహాశివరాత్రి సందర్భంగా అడియన్స్ ముందుకు వచ్చింది మజాకా సినిమా. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు తెరకెక్కించారు. ఇందులో రావు రమేశ్ కీలకపాత్రలో నటించగా.. రీతూ వర్మ కథానాయికగా కనిపించింది. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అన్షు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‏టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉంటుందని అర్థమైపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుండగా.. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. అలాగే ఈ సినిమా ప్రీమియర్ చూసిన నెటిజన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. మజాకా సినిమా అదిరిపోయిందని… ముఖ్యంగా కామెడీ వేరేలెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేశ్ కాంబినేషన్ సపూర్ అని.. ఇద్దరూ అద్భుతంగా నటించారని.. ఈ సినిమా రావు రమేశ్ కామెడీ టైమింగ్, పంచులు అదిరిపోయాయని అంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ థియేటర్లో ఎంజాయ్ చేస్తామని.. 100% ఎంటర్టైన్మెంట్ అని.. పక్కా ఫ్యామిలీ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పర్ఫెక్ట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశామని.. అన్షు యాక్టింగ్ గుడ్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..