AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundeep Kishan : ‘బాషా’ లెవెల్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందని అప్రిషియేట్ చేస్తున్నారు : సందీప్ కిషన్

సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో, టిజి విశ్వప్రసాద్,

Sundeep Kishan : 'బాషా' లెవెల్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందని అప్రిషియేట్ చేస్తున్నారు : సందీప్ కిషన్
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2021 | 4:19 AM

Share

Sundeep Kishan : సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్”. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ స్పోర్ట్స్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ‌ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం మార్చి 5న అత్యధిక థియేటర్స్ లో గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.. రిలీజ్ అయిన ప్రతీ చోటా టెర్రిపిక్ రెస్పాన్స్ తో దిగ్విజయంగా రన్ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మార్చి 10న సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “థియేటర్స్ లో ఆడియెన్స్ రెస్పాన్స్ ఒక ఎనర్జీ, ధైర్యాన్ని ఇచ్చింది. రెగ్యులర్ గా మూవీస్ చేయకూడదు.. విభిన్నమైన పాత్రలు చేయాలి అని.. ఎదురుచూస్తున్న టైంలో తమిళంలో హిట్ అయిన మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. హాకీ బ్యాక్డ్రాప్ లో లవ్, ఎమోషన్స్ తో రూపొందించిన చిత్రం ఇది. ప్రతీ ఒక్కరూ రజినీకాంత్ గారి ‘బాషా’ లెవెల్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవాళ మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు అందరూ హ్యాపీగా లాభాలతో వున్నాం అని చెప్తున్నారు.. లైఫ్ లాంగ్ ఈ సినిమా నాకు గుర్తుంటుంది. రాహుల్, దర్శి సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు గర్వంగా ఉంది. అభిషేక్, వివేక్, విశ్వప్రసాద్, దయా అందరం కథని నమ్మి సినిమా చేశాం. జీవన్ ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా ఫెంటాస్టిక్ గా చేశాడు. ఫ్యూచర్లో గొప్ప దర్శకుడు అవుతాడు. హిప్ హాప్‌ తమిజ్ వండ‌ర్‌ఫుల్‌ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే కెవిన్ రాజ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. కొత్త కంటెంట్ తో సినిమాలు చేయవచ్చున‌ని నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది.” అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nivetha Thomas : పవర్ స్టార్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న ముద్దుగుమ్మ.. వకీల్ సాబ్ ఈ అమ్మడి కెరియర్ కు ప్లేస్ అవుతాడా..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..