sumanth akkineni : వాల్తేరు శీనుగా రానున్న అక్కినేని హీరో.. విశాఖపట్నం రౌడీగా కనిపించనున్న సుమంత్
మేనమామ నాగార్జున నిర్మించిన 'సత్యం'తో తొలి సక్సెస్ చూసిన సుమంత్ ఆ తరువాత నుంచీ ఆచితూచి అడుగేస్తూ ముందుకుసాగుతున్నారు..సత్యం' తరువాత "గౌరీ, మహానంది,..
sumanth akkineni : మేనమామ నాగార్జున నిర్మించిన ‘సత్యం’తో తొలి సక్సెస్ చూసిన సుమంత్ ఆ తరువాత నుంచీ ఆచితూచి అడుగేస్తూ ముందుకుసాగుతున్నారు..సత్యం’ తరువాత “గౌరీ, మహానంది, గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్” వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. చాలాకాలాం తర్వతమళ్ళిరావా అనేసినిమాతో హిట్ను సొంతంచేసుకున్నాడు. ఫీల్గుడ్ మూవీగాతెరకెక్కిన ఈసినిమా మంచిటాక్ ను సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలో సుమంత్ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘అనగనగా ఒక రౌడీ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు.ఈ సినిమాలో సుమంత్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. గడ్డం మీసాలతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. వాల్తేరు శీనుగా, విశాఖపట్నం రౌడీగా సుమంత్ అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుందని చిత్ర దర్శకుడు మను యజ్ఞ తెలిపాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్.. మూవీలో ఆ మార్పులు చేయడం లేదట..