సుకుమార్ గడ్డం సెంటిమెంట్..సినిమా బ్లాక్‌బాస్టర్..

|

Mar 20, 2020 | 11:00 PM

ఆయన మాస్ సినిమా తీస్తే మేమంతా సర్దుకోవాల్సిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ను ఉద్దేశించి..రాజమౌళి చేసిన వ్యాఖ్యలివి. అన్నట్లుగానే ఇటీవల ‘రంగస్థలం’ సినిమాతో ఊర మాస్ హిట్ అందుకున్నారు సుకుమార్. తాజాగా ఆయన అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్స్‌కి, కాంబినేషన్లకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. తాజాగా ఆ లిస్ట్‌లో చేరిపోయారు దర్శకుడు సుకుమార్. స్వతహాగా ఎప్పుడూ గడ్డం పెంచుకుని ఉంటే సుక్కు..తన సినిమాలో హీరోలకి కూడా గడ్డం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ‘నాన్నకు […]

సుకుమార్ గడ్డం సెంటిమెంట్..సినిమా బ్లాక్‌బాస్టర్..
Follow us on

ఆయన మాస్ సినిమా తీస్తే మేమంతా సర్దుకోవాల్సిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ను ఉద్దేశించి..రాజమౌళి చేసిన వ్యాఖ్యలివి. అన్నట్లుగానే ఇటీవల ‘రంగస్థలం’ సినిమాతో ఊర మాస్ హిట్ అందుకున్నారు సుకుమార్. తాజాగా ఆయన అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్స్‌కి, కాంబినేషన్లకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. తాజాగా ఆ లిస్ట్‌లో చేరిపోయారు దర్శకుడు సుకుమార్. స్వతహాగా ఎప్పుడూ గడ్డం పెంచుకుని ఉంటే సుక్కు..తన సినిమాలో హీరోలకి కూడా గడ్డం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ సినిమాలలో ఆయన స్టార్ హీరోలను గుబురు గడంతో చూపించారు. అవి రెండు కూడా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారట సుక్కు.

అల్లు అర్జున్ సినిమాలో లారీ డ్రైవర్ పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే లుక్ ఊర మాస్‌గా ఉండాలి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో గుబురు గడ్డం పెంచమని చెప్పాడట క్రియేటివ్ దర్శకుడు. బన్నీ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడట. ఇటీవల బయటకు వచ్చిన బన్నీ ఫోటోలు కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.  మరి ఈ సినిమాతో సుక్కు ఇండస్ట్రీకి ఎటువంటి బ్లాక్‌బాస్టర్ అందిస్తాడో చూడాలి,