Sukumar: నా కళ్ళన్నీ రష్మిక మీదే.. మా ఇద్దరి మధ్య ఎప్పుడు డిస్కషన్ జరగలేదు

|

Dec 03, 2024 | 11:18 AM

అల్లు అర్జున్ 'పుష్ప 2' విడుదలకు ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రానికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ కారణంగానే పుష్ప2 సినిమా తొలిరోజే 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధిస్తుందని అంటున్నారు.

Sukumar: నా కళ్ళన్నీ రష్మిక మీదే.. మా ఇద్దరి మధ్య ఎప్పుడు డిస్కషన్ జరగలేదు
Sukumar
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ విడుదలకు ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రానికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ కారణంగానే పుష్ప2 సినిమా తొలిరోజే 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధిస్తుందని అంటున్నారు. మొదట భాగం ‘పుష్ప: ది రైజ్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ వంతు వచ్చింది. మూడో భాగానికి సంబంధించి రష్మిక మందన్న కూడా పెద్ద హింట్ ఇచ్చింది.  అలాగే సుకుమార్ కూడా నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మీ హీరో నాకు రెండుళ్లు ఇస్తే పుష్ప 3 చేస్తా అని అన్నారు సుకుమార్. ఇక ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రష్మిక పై సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మోనిటర్ లో రష్మికా పైనే నా కళ్ళు ఉండేవి. ఆమె వెనకాల ఉన్న కూడా నేను ఆమెనే చూస్తూ ఉండిపోయేవాడిని అని అన్నారు సుకుమార్. నేను ఎడిట్ చేసేటప్పుడు తన క్లోజప్స్ చూస్తూ ఉండిపోయేవాడిని. మాకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యింది. ఎంతలా అంటే.. నేను చెప్తే వెంటనే వెళ్లి చేసేస్తోంది. అంతే ఎప్పుడూ మా ఇద్దరి మధ్య డిస్కషన్ లేదు. ఎంత బాగా యాక్ట్ చేసిందంటే.. ఎక్స్ ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఇచ్చింది. ఎలా అంటే హీరో డైలాగ్ చెప్తున్నా వెనక ఆమె ఇచ్చే ఎక్స్ ప్రేక్షన్స్ నన్ను ఆకట్టుకున్నాయి. నా కళ్ళు ఆమె వైపే వెళ్ళేవి అని అన్నారు సుకుమార్.

అలాగే సుకుమార్ మాట్లాడుతూ.. నేను బన్నీని ఆర్య నుండి చూస్తున్నాను. తను ఎలా ఎదుగుతున్నాడు చూస్తూనే వచ్చాను. తనని వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా చూసాను. ఈ పుష్ప అనే సినిమా ఇలా వచ్చింది అంటే దానికి కారణం కేవలం నాకు బండికి ఉన్న ఒక బాండింగ్ కారణంగానే. బన్నీ ఒక సీన్ కోసమో లేదా ఒక సాంగ్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఎంతో కష్టపడతాడు. అది ఎంత చిన్నదైనా సరే చాలా శ్రద్ధతో చేస్తాడు. కేవలం నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను. నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర పూర్తి కథ లేదు. నువ్వు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు నీకోసం నేను ఏమైనా చేసేయొచ్చు అనిపించింది అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.