Pushpa The Rule : పేరుకు ఆయన లెక్కల మేస్టారు. కానీ.. అప్పుడప్పుడు ఆయన లెక్క కూడా తప్పేలా కనిపిస్తుంది. పుష్పరాజ్‌కి ఆలిండియా పర్మిట్ ఇప్పిస్తానన్న లెక్కను పక్కాగానే వర్కవుట్ చేశారు సుక్కూ. బట్.. పుష్ప సెకండ్ చాప్టర్ విషయంలోనే ముందనుకున్న క్యాల్‌కులేషన్ కుదరడం లేదట. ఫిబ్రవరి ఎండ్ లేదా మార్చి ఫస్ట్‌వీక్‌లో షూటింగ్ షురూ చేస్తాం.. కరెక్ట్‌గా ఏడాదికల్లా ఈ డిసెంబర్‌లోనే రిలీజ్ చేస్తాం.. అనేది పుష్ప సెకండ్ పార్ట్‌పై సుక్కూ ఇచ్చిన స్టేట్‌మెంట్. ఇప్పుడు మార్చి కూడా క్రాసైపోతోంది. సుకుమార్ వెకేషన్‌లో వున్నారు. ఆయన హైదరాబాద్ రావాలి… షెడ్యూల్స్ ఫైనల్ చెయ్యాలి… మెగాఫోన్ పట్టాలి… ఇదంతా అయ్యేసరికి నెలయినా గడుస్తుంది. మరి.. ఈ క్రిస్మస్‌కి పుష్పరాజ్ రూలింగ్ స్టార్టయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. 2019 అక్టోబర్లో సెట్స్‌మీదికెళ్లి.. 2021 డిసెంబర్‌లో రిలీజైంది పుష్ప ఫస్ట్ పార్ట్. దాదాపు రెండేళ్లకు పైగా టైమ్ తీసుకుని… మంచి ఫలితమే రాబట్టుకున్నారు సుకుమార్. కాకపోతే… సెకండ్ పార్ట్ లెక్క వేరు. పుష్ప సీక్వెల్ కోసం టోటల్ ఇండియా వెయిటింగ్‌లో వుంది. నార్త్ నుంచి 400 కోట్ల దాకా ఫ్యాన్సీ ఆఫర్లొచ్చి ప్రాజెక్ట్‌ను క్రేజీగా మార్చేస్తున్నాయి. అందుకే… ఈ సినిమాను హర్రీబర్రీగా చేసి… పోస్ట్‌ప్రొడక్షన్ టైమ్‌లో ఇబ్బంది పడకూడదని ఫిక్సయ్యింది సుక్కూ టీమ్.
కాస్ట్ అండ్ క్రూకి సంబంధించి పెద్దగా ఛేంజెస్ వుండే ఛాన్సయితే లేదు. స్పెషల్ సాంగ్ కోసం సమంత ప్లేస్‌లో దిశా పటానీకి ఛాన్స్ ఇవ్వాలన్నది ఒక ఐడియా. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా వున్నా… షూటింగ్ లొకేషన్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు సుక్కూ. ఈసారి ఫారిన్ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేస్తారన్న టాక్ వుంది. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా వున్న సినిమా… పైగా VFXతో ప్రమేయం లేకుండా రియలిస్టిక్ కంటెంట్‌తో తీసే సినిమా. అందుకే ఆరేడు నెలల్లో చుట్టబెట్టడం కుదరదన్నారట సుక్కూ. టేక్ యువర్ ఓన్ టైమ్ అని ప్రొడ్యూసర్ల నుంచి కూడా సపోర్ట్ దొరికింది. అందుకే 2023 సమ్మర్ రేసులో నిలిచేలా స్కెచ్చేశారట లెక్కల మేస్టారు.
మరిన్ని ఇక్కడ చదవండి :