ఎంజాయ్ చేద్దామని పార్టీకి వెళ్లిన హీరోయిన్.. అక్కడి సీన్ చూసి దెబ్బకు కళ్లు మూసుకుందట..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రేటీలు లైఫ్ ను బిందాస్ గా గడుపుతూ ఉంటారు. కాస్ట్లీ కార్లు, ఖరీదైన బంగ్లాలు, బ్రాండెడ్ బట్టలు.. అంటూ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే సినీ సెలబ్రెటీలు.. ఎక్కువగా విదేశాల్లో వెకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఎంజాయ్ చేద్దామని పార్టీకి వెళ్లిన హీరోయిన్.. అక్కడి సీన్ చూసి దెబ్బకు కళ్లు మూసుకుందట..
Actress

Updated on: Aug 21, 2025 | 8:24 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్, లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాస్ట్లీ కార్లు,  ఖరీదైన బట్టలు, బ్రాండెడ్ వాచ్‌లు  వాడుతుంటారు. ఇక షూటింగ్స్‌కు ఏమాత్రం గ్యాప్ దొరికినా విదేశాలకు చెక్కేస్తూ ఉంటారు. ఇక పార్టీలకు కొదవే ఉండదు.లైఫ్‌ను బిందాస్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినీ సెలబ్రెటీలు. అయితే ఓ హీరోయిన్ కూడా ఓ పార్టీకి ఆహ్వానం వస్తే వెళ్లిందంట.. తీరా అక్కడికి వెళ్లి చూసి అవాక్ అయ్యిందట.. బాబోయ్ ఇదేం పార్టీ రా బాబు..!! అంటూ కళ్లు మూసుకుందట ఆమె.. ఇంతకూ ఆ పార్టీ ఏంటి.? ఆ హీరోయిన్ ఎవరు అనేది ఓ సారి చూద్దాం.!

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

బాలీవుడ్‌లో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్‌లో సుచిత్రా కృష్ణమూర్తి  ఒకరు. 90వ దశకంలో తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సుచిత్రా కృష్ణమూర్తి . షారుక్ ఖాన్ తో నటించిన ‘కభీ హాన్ కభీ నా’తో సుచిత్రా కృష్ణమూర్తి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాను ఓ న్యూడ్ పార్టీకి వెళ్ళాను అంది చెప్పింది సుచిత్రా కృష్ణమూర్తి. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

బర్లింగేమ్‌లో న్యూడ్ పార్టీకి వెళ్లడం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది సుచిత్రా కృష్ణమూర్తి. అనుకోకుండా అక్కడికి వెళ్ళాను అని తెలిపింది సుచిత్రా. అయితే బర్లింగేమ్‌లో జరిగిన పార్టీకి నాకు ఆహ్వానం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను. తీరా డోర్ తీసి చూసి నేను షాక్ అయ్యాను. నేను ఎప్పుడూ దేశీ అమ్మాయినే. ఆ పార్టీకి వెళ్లాక స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని జపించాలి అని అనిపిస్తుంది. ఓరి దేవుడా…’ అలాగే ఈ న్యూడ్ పార్టీలు ఒకింత మంచిదే అంటుంది సుచిత్ర. శరీర సానుకూలతను ప్రోత్సహించడం, శరీరానికి సంబంధించిన ఆందోళనను తొలగించడమే ఈ న్యూడ్ పార్టీ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్‌గా మారింది. నెటిజన్స్ ఈపోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.