
టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న ప్రేక్షకులు ఎప్పుడూ ఆమెనే ఫెవరెట్ హీరోయిన్ అంటుంటారు. ఆమె కనిపిస్తే చాలు కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతారు ఆమె స్టార్ హీరోయిన్ అనుష్క. ఈ ఆరడుగుల అందగత్తె సినిమాలు తగ్గించినాకూడా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సూపర్ సినిమాతో మొదలు పెట్టిన ఆమె కెరీర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి తో కలిసి సినిమా చేస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనేటైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనుష్క టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బాహుబలి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది అనుష్క. ఆ తర్వాత అనుష్క చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నిశ్శబ్దం అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు సినిమా చేస్తుంది.
ఇదిలా ఉంటే అనుష్క రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. గతంలో మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఏకంగా 6 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశశెట్టి సినిమా సెప్టెంబర్ నెల 7వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా కనిపించనుంది. అలాగే నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అనుష్క శెట్టి ఇన్ స్టా గ్రామ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.