Tollywood : రిపీట్ కాంబినేషన్స్‌కు సై అంటున్న స్టార్ హీరోలు, డైరెక్టర్స్

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేయడం మాత్రమే రవితేజకు తెలిసిన పని. ఇప్పుడూ ఇదే చేస్తున్నారీయన. టైగర్ నాగేశ్వరరావు విడుదలై వారం కాకముందే మరో సినిమా ప్రకటించారు. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు.. తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో ప్రాజెక్ట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతుంది ఈ చిత్రం.

Tollywood : రిపీట్ కాంబినేషన్స్‌కు సై అంటున్న స్టార్ హీరోలు, డైరెక్టర్స్
Tollywood

Updated on: Oct 26, 2023 | 8:15 AM

టాలీవుడ్‌లో రిపీట్ కాంబినేషన్స్‌కు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ముందు సినిమా హిట్టైనా.. ఫ్లాపైనా దర్శకులను మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు మన హీరోలు. కథ నచ్చితే.. ట్రాక్ రికార్డ్ చూడకుండా ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రిపీట్ కాంబినేషన్స్ ఎక్కువయ్యాయి. మరి అవేంటి..? ఎవరెవరు ఎవరితో సినిమాలు చేస్తున్నారు..?

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేయడం మాత్రమే రవితేజకు తెలిసిన పని. ఇప్పుడూ ఇదే చేస్తున్నారీయన. టైగర్ నాగేశ్వరరావు విడుదలై వారం కాకముందే మరో సినిమా ప్రకటించారు. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు.. తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో ప్రాజెక్ట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతుంది ఈ చిత్రం.

డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్‌లో అమర్ అక్బర్ ఆంటోనీ, వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ చేస్తున్న మూడో సినిమా ఇది. ఇక నాని కూడా రిపీట్ కాంబినేషన్ వైపు అడుగేసారు. ఈ హీరో ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్.

అంటే సుందరానికి ఫ్లాపైనా కూడా వివేక్ టేకింగ్ నచ్చి ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చారు నాని. మరోవైపు మహేష్ బాబు, త్రివిక్రమ్ మూడోసారి కలిసి పని చేస్తున్నారు. అతడు, ఖలేజా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఈ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అల్లు అర్జున్‌తో త్వరలోనే 4వ సినిమా చేయబోతున్నారు గురూజీ. ఇలా మొత్తానికిప్పుడు రిపీట్ కాంబినేషన్స్ టైమ్ నడుస్తుంది.

మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.