
మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి హైదరాబాద్ వేదికగా ఓ గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న ఈ ఈవెంట్ కు చిత్ర బృందంతో పాటు అతిరథ మహారథులు హాజరయ్యారు. అలాగే సినీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో వారణాసి సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు నిర్మాత కేఎల్ నారాయణ.. ’15 ఏళ్ల క్రితమేమహేష్ బాబు, రాజమౌళి గారితో ఓ సినిమా చేద్దామనుకున్నాం. కానీ ఇంత టైమ్ పడుతుందని అసలు ఊహించలేదు.. సూపర్ స్టార్ కృష్ణ గారి లాగే మహేష్ కూడా ప్రొడ్యూసర్స్ హీరో. 15 ఏళ్ల కింద రాజమౌళి గారిని కూడా అడిగినపుడు ఓకే అన్నారు. గత 15 ఏళ్లలో ఈగ, బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. డైరెక్టర్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా.. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. సేమ్ సింప్లిసిటీ, సేమ్ కమిట్‌మెంట్. థ్యాంక్యూ మీ కమిట్‌మెంట్‌కు. ఇక ఇండియన్ హీరోయిన్ అయినా కూడా హాలీవుడ్‌కు వెళ్లి ఇండియన్ సినిమా డైమెన్షన్స్ మార్చింది ప్రియాంక చోప్రా.. థ్యాంక్యూ. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా రాజమౌళి కథ చెప్పగానే ఓకే అన్నారుజ క్షణక్షణం సమయంలో అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్.. కానీ ఇప్పుడు ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు.. లార్జెర్ దెన్ లైఫ్ సినిమా అవుతుంది మీకు. ఈ సినిమా లేట్ అవ్వదు.. చాలా త్వరగా వస్తుంది’ అని కేఎల్ నారాయణ చెప్పుకొచ్చారు.
మరో నిర్మాత ఎస్‌ఎస్ కార్తికేయ మాట్లాడుతూ.. ‘చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ.. నెమ్మదిగా ఒక నిర్మాత అయ్యాను. ఓ పెద్ద హీరోతో సినిమా చేయడానికి చాలా టైమ్ పడుతుందని అనుకున్నా.. కానీ త్వరగా వచ్చింది. లెజెండ్స్‌తో కలిసి పని చేస్తున్నా.. అది నా అదృష్టం.. ఇండియన్ సినిమాను గ్లోబల్‌కు తీసుకెళ్లడంలో.. మన ఇండియన్ సినిమాకు గ్లోబల్ ఆడియన్స్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అది హైదరాబాద్‌లో జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. కేఎల్ నారాయణ గారికి ప్రత్యేకంగా థ్యాంక్యూ’ అని చెప్పుకొచ్చారు.
కాగా 2027 వేసవిలో వారణాసి సినిమా విడుదల కానుందని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హింట్ ఇచ్చారు.
Title fixed #Varanasi 🔥🦁❤️@urstrulyMahesh ha looks enti ayya 💗✨#GlobeTrotter #SSRajamouli pic.twitter.com/Mk2KFK7eJn
— Wildfire ❤️🔥🔥 (@thalassopile_) November 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.