
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో హీరో మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించారు దర్శక ధీరుడు రాజమౌళి. అతనిని చూసి తాను కూడా అలా ఉండేందుకు ట్రై చేస్తాను’ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేసినందుకు పోలీసులకు థ్యాంక్యూ. కేఎల్ నారాయణ గారూ నన్ను, మహేష్‌ను కలిపినందుకు థ్యాంక్యూ.
నేను ప్రతీ సినిమా ముందు ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పాను. కొన్ని సినిమాలకు కుదురుతుంది. ఈ సినిమాకు మాటలు సరిపోవు. ఇలాంటి సినిమా కథను మాటల్లో చెప్పడం కుదరదు. కథ చెప్పకూడదు.. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేయాలనే ఉద్దేశంతోనే వీడియో చేసాం. మార్చ్ నుంచి ప్లాన్ చేసాం. జూన్, జులై అలా అన్ని అయిపోయాయి. నవంబర్‌లో వస్తున్నాం. చిన్నపుడు నాకు కృష్ణ గారి గొప్పతనం తెలియదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమయ్యాక ఆయన గొప్పతనం అర్థమైంది. కొత్త టెక్నాలజీని పరిచయం చేయడానికి ఎన్నో దారులు వేయాలి. అలాంటిది కృష్ణ గారూ ఎన్నో పరిచయం చేసారు.. సినిమా స్కోప్ అల్లూరి, ఈస్ట్ మెన్ కలర్ ఈనాడు, ఫస్ట్ 70ఎంఎం సింహాసనం ఇంట్రడ్యూస్ చేసారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు ప్రీమియమ్ లార్జ్ స్కేల్ సినిమా ఫర్ ఐమాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఐమాక్స్‌లో ప్రొడ్యూస్ చేసి 1 ఇష్టూ 1.9 ఫార్మాట్‌లో షూట్ చేసాం. ఇది ఫుల్ స్క్రీన్ ఫార్మాట్.’
‘మహేష్ బాబు గురించి మాట్లాడాలి.. సినిమా గురించి, నటన గురించి కాదు.. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి.. అందరూ నేర్చుకోవాలనుకునే గుణం ఉంటుంది. మనందరికీ సెల్ ఫోన్ అడిక్షన్ ఉంటుంది.. ఆఫీస్‌కు వచ్చాడు, షూటింగ్‌కు వచ్చాడంటూ సెల్ ఫోన్ ముట్టుకోడు.. మళ్లీ వెళ్లేటప్పుడే ఫోన్ టచ్ చేస్తాడు. అందరం పాటించాలి.. నీలా ఉండటానికి ట్రై చేస్తాను’ అని మహేష్ పై ప్రశంసలు కురిపించాడు రాజమౌళి.
#Rajamouli garu spech #Varanasi #MaheshBabu garu pic.twitter.com/FUOCVaFxO4
— ❤️🩵🧡 (@ArjunPrathap13) November 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.