RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపించనున్నాడు జక్కన. ఇక ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు జక్కన.. ప్రస్తుతం షూటింగ్ అనంతరం పనులు జరుపుకుంటుంది ఈ సినిమా.
ఇక సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌కు జోడీగా అలియా భట్, ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, అలీ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక పోతే దసరా కానుకగా ‘ఆర్‌ఆర్‌ఆర్’సినిమా వరల్డ్ వైడ్‌గా అక్టోబరు 13న విడుదల చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేశారు.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు మేకర్స్.. జనవరి 7 న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ పోస్టర్ లో తారక్, చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ కనిపిస్తున్నారు.
07.01.2022. It is… 🙂 #RRRMovie #RRROnJan7th @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/eQDxGEajdy
— rajamouli ss (@ssrajamouli) October 2, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :