“ఇక వెయిట్ చెయ్య‌లేం..షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందే”

క‌రోనా వ‌చ్చింది. లాక్ డౌన్ తెచ్చింది. ఈ నేప‌థ్యంలో అన్ని బంద్ అయ్యాయి. ఈ మ‌ధ్యే ప్ర‌భుత్వాలు స‌డ‌లింపులు ఇస్తుండ‌టంతో..అన్ని వ్య‌వ‌స్థ‌లు తిరిగి ట్రాక్ పైకి వ‌స్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం నిబంధ‌‌‌‌న‌లు పాటిస్తూ..సినిమా, సిరియ‌ల్స్ షూటింగ్స్ జ‌రుపుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.

ఇక వెయిట్ చెయ్య‌లేం..షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందే

Updated on: Jun 10, 2020 | 11:02 PM

క‌రోనా వ‌చ్చింది. లాక్ డౌన్ తెచ్చింది. ఈ నేప‌థ్యంలో అన్ని బంద్ అయ్యాయి. ఈ మ‌ధ్యే ప్ర‌భుత్వాలు స‌డ‌లింపులు ఇస్తుండ‌టంతో..అన్ని వ్య‌వ‌స్థ‌లు తిరిగి ట్రాక్ పైకి వ‌స్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం నిబంధ‌‌‌‌న‌లు పాటిస్తూ..సినిమా, సిరియ‌ల్స్ షూటింగ్స్ జ‌రుపుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ క్ర‌మంలో మూడు నెలల తర్వాత షూటింగ్​కు వెళ్లడానికి ఎంతో ఉత్సుక‌త‌తో ఎదురుచూస్తున్నాని సోష‌ల్ మీడియా వెల్లడించారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయ‌న‌ రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్’‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా లాక్​డౌన్​ కారణంగా మార్చిలో షూటింగ్ ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో ‘ఆర్​.ఆర్​.ఆర్​ షూటింగ్ స‌మ‌యంలో దిగిన ఫోటోను తన ఇన్​స్టా స్టోరీస్​లో జతచేస్తూ.. ఓ పోస్ట్​ చేశారు జ‌క్క‌న్న‌. అందులో సినిమాటోగ్రాఫర్​ కెకె సెంథిల్​ కుమార్, విజువల్​ ఎఫెక్ట్స్​ శ్రీనివాస్​ మోహన్​​లతో జక్కన్న ఏదో డిస్క‌స్ చేస్తున్న‌ట్లు ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ‌ఎన్టీఆర్‌ తెలంగాణ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్​ నటులు అజయ్​ దేవ్​గణ్​, అలియా భట్​లు కీలకపాత్రలను పోషిస్తున్నారు.