SS Rajamouli: వంక పెడితే యూత్‌ గొడవ చేస్తారేమో.. రొమాంటిక్‌ సినిమాపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

|

Oct 28, 2021 | 3:42 PM

పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ, కేతికా శర్మ జంటగా నటించిన తాజా చిత్రం 'రొమాంటిక్‌'. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను పూరీ

SS Rajamouli: వంక పెడితే యూత్‌ గొడవ చేస్తారేమో.. రొమాంటిక్‌ సినిమాపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us on

పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ, కేతికా శర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కలిసి సంయుక్తంగా తెరకెక్కించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం(అక్టోబర్‌ 29)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ‘రొమాంటిక్‌’ సినిమా ప్రీమియర్‌ షో ఏర్పాటుచేశారు. రాజమౌళి దంపతులు, అనిల్‌ రావిపూడి, బాబీ, గోపిచంద్‌ మలినేని, మెహర్‌ రమేశ్‌, హరీష్‌ శంకర్‌, బొమ్మరిల్లు భాస్కర్‌, మోహన కృష్ణ ఇంద్రగంటి, గుణశేఖర్‌, అలీ, ఆనంద్‌ దేవరకొండ, విశ్వక్‌ సేన్‌ తదితర ప్రముఖులు ప్రీమియర్‌ షోను వీక్షించి చిత్రం బాగుందని కితాబిచ్చారు.

దర్శకుడు ధైర్యంగా సినిమాను తెరకెక్కించాడు..
ప్రీమియర్‌ షో చూశాక రాజమౌళి స్పందిస్తూ ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ‘ముసలోడివై పోయావ్‌…నీకెం తెలుస్తుంది’ అని యూత్‌ అంతా గొడవపడతారేమోనని భయంగా ఉంది. ఇది కంప్లీట్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌. అనిల్‌ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తన మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాశ్‌, కేతికల రూపంలో డైరెక్టర్‌కు అద్భుతమైన జోడీ దొరికింది. ఇక ఆకాశ్‌ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా అతడిని మరోమెట్టు పైకెక్కిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు’ అంటూ చెప్పుకొచ్చారు.

Also Read:

Malli Modalaindi Trailer: విడాకుల తర్వాత ‘మళ్ళీ మొదలైంది’ అంటున్న సుమంత్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Sreeleela: అందాల చందమామ శ్రీలీల గ్లామరస్ ఫోటో గ్యాలరీ

Amala Paul: 14 లక్షలు దాటిన ఫాలోవర్స్ సంఖ్య … ఫాన్స్‌ను ఫోటోస్‌తో సర్‌ప్రైజ్ చేసిన అమలా పాల్