SS Rajamouli: ‘నా క్రియేటివిటిని ప్రోత్సాహించింది ఆమెనే’.. విశ్వవేదికపై రాజమౌళీ స్పీచ్ వేరేలెవల్..

తాజాగా జనవరి 16న ఆర్ఆర్ఆర్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నిలిచింది. ఈ అవార్డ్ అందుకున్న అనంతరం తన స్పీచ్‏తో ఆకట్టుకున్నారు రాజమౌళి. అందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టి..

SS Rajamouli: 'నా క్రియేటివిటిని ప్రోత్సాహించింది ఆమెనే'.. విశ్వవేదికపై రాజమౌళీ స్పీచ్ వేరేలెవల్..
Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 16, 2023 | 2:42 PM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవేదికపై నిలబెట్టాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన జక్కన్న.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చిత్రం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. భారతీయులే కాదు.. విదేశీయులు సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. ఇటీవల గోల్డెన్ గ్లోబ్స్ 2023తో సహా ప్రతిష్టాత్మక వేడుకలలో అనేక అవార్డులను గెలుచుకుంది ఈ చిత్రం. ఇక తాజాగా జనవరి 16న ఆర్ఆర్ఆర్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నిలిచింది. ఈ అవార్డ్ అందుకున్న అనంతరం తన స్పీచ్‏తో ఆకట్టుకున్నారు రాజమౌళి. అందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టి.. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళలు.. వారి పోత్సాహం గురించి చెప్పుకొచ్చారు. చివరగా జై హింద్, మేరా భారత్ మహాన్ అంటూ ముగించారు. దీంతో విశ్వ వేదికపై తెలుగులో రాజమౌళి స్పీచ్ స్టార్ట్ చేసి భారతీయుడిగా గర్వంగా చెప్పుకోవడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆదివారం లాస్ ఏంజిల్స్ లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఎంపికైంది. ఈ వేడుకలలో రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ కలిసి ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. “నా జీవితంలోని మహిళలందరికీ ధన్యవాదాలు. మా అమ్మ రాజానందిని స్కూల్ చదువు నాకు ఎక్కువైందని భావించి.. అప్పుడే కామిక్స్, స్టోరీ బుక్స్ చదవమని నన్ను ప్రోత్సహించింది. నా సృజనాత్మకతను ఎప్పటికప్పుడు ప్రోత్సహించింది. ఆ తర్వాత నా చెల్లెలు.. శ్రీవల్లి. నాకు మరో అమ్మ. నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుండేది. నా భార్య రమ.. నా సినిమాలన్నింటికీ తనే కాస్ట్యూమ్ డిజైనర్. అంతకంటే ఎక్కువ ఆమె నా జీవితానికీ డిజైనర్. ఈరోజు ఆమె ఇక్కడ లేకుంటే నేను ఇక్కడ లేను. నా కూతుర్ల చిరునవ్వు నా జీవితానికి వెలుగునిస్తుంది. చివరగా నా మాతృభూమి భారతదేశం. మేరా భారత్ మహాన్.. జై హింద్.. ధన్యవాదాలు. ” అంటూ ముగించారు.

ఇదిలా ఉంటే.. అవతార్..ది వే ఆఫ్ వాటర్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రెండుసార్లు చూశారు. ఈ సినిమా గురించి జక్కన్నతో దాదాపు 10 నిమిషాల పాటు చర్చించారు. ఈ విషయాన్ని జక్కన్న తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.