SS Rajamouli : డాన్స్ ఇరగదీసిన రాజమౌళి.. భార్యతో కలిసి అదిరిపోయే స్టెప్పులు

ప్రభాస్ తో కలిసి బాహుబలి సినిమా చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. పాన్ ఇండియా సినిమాలకు బాహుబలి సినిమా దారి చూపించిందనే చెప్పాలి. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు భారీ హిట్స్ అందుకోవడంతో వరుసగా ఆతర్వాత పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ఆయన తన సత్తా చాటారు.

SS Rajamouli : డాన్స్ ఇరగదీసిన రాజమౌళి.. భార్యతో కలిసి అదిరిపోయే స్టెప్పులు
Rajamouli
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2024 | 1:29 PM

దర్శక ధీరుడు రాజమౌళి చేసింది తక్కువ సినిమాలే కానీ ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. వరుస సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా.. పాన్ ఇండియా హిట్స్ తో స్టార్ దర్శకుడిగా ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. ప్రభాస్ తో కలిసి బాహుబలి సినిమా చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. పాన్ ఇండియా సినిమాలకు బాహుబలి సినిమా దారి చూపించిందనే చెప్పాలి. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు భారీ హిట్స్ అందుకోవడంతో వరుసగా ఆతర్వాత పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ఆయన తన సత్తా చాటారు. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి సినిమా తెరకెక్కించడం అంటే అంతా సామాన్యమైన విషయం కాదు. కానీ రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కించి నయా రికార్డ్ క్రియేట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి భార్యతో కలిసి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి ప్రభుదేవా పాటకు డాన్స్ చేశారు.

ప్రభుదేవా హీరోగా నటించిన ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చేయి తగిలితే అనే పాట కు రాజమౌళి, రమా రాజమౌళి డాన్స్ చేశారు.  అదిరిపోయే స్టెప్పులతో రాజమౌళి ఆకట్టుకున్నారు. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇరగదీశాడు గురువుగారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ గా రూపొందుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా పై మహేష్ బాబు , రాజమౌళి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.