Jabardasth: అనసూయ కంటే ముందే జబర్దస్త్ యాంకర్‌గా మొదట నన్నే అడిగారు.. ఆ ఒక్క కారణంతోనే రిజెక్ట్ చేశా

జబర్దస్త్ కామెడీ షోకు చాలా మంది యాంకర్లుగా వ్యవహరించారు. అనసూయ, రష్మీ గౌతమ్, సౌమ్య రావు, సిరి హన్మంతు.. ఇలా చాలా మంది ఈ టీవీషోను హోస్ట్ చేశారు. అయితే అందరికంటే ముందు తనకే జబర్దస్త్ యాంకర్ గా అవకాశం వచ్చిందంటోందీ ఓ అందాల తార.

Jabardasth: అనసూయ కంటే ముందే జబర్దస్త్ యాంకర్‌గా మొదట నన్నే అడిగారు.. ఆ ఒక్క కారణంతోనే రిజెక్ట్ చేశా
Jabradasth Anasuya

Updated on: Jun 15, 2026 | 7:50 PM

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో కంటే ఇప్పుడు కొంచెం క్రేజ్, ఆదరణ తగ్గిందేమో కానీ చాలా మంది ఇప్పటికీ ఈ కామెడీ షోను క్రమం తప్పకుండా చూస్తుంటారు. ముఖ్యంగా యూట్యూబ్ లో జబర్దస్త్ వీడియోలకు భారీ వ్యూస్ వస్తున్నాయి. కాగా 2013లో ప్రారంభమైన ఈ జబర్దస్త్ షోకు చాలా మంది ముద్దుగుమ్మలు యాంకర్లుగా వ్యవహరించారు. అనసూయ, రష్మీ గౌతమ్, సౌమ్య రావు, బిగ్ బాస్ సిరి హన్మంతు.. ఈ కామెడీ షోను హోస్ట్ చేశారు. అలాగే జబర్దస్త్ స్పెషల్ ఈవెంట్స్ తో పాటు కొన్ని ఎపిసోడ్స్‌కు శ్రీముఖి, వర్షిణి వంటి వారు కూడా యాంకర్లుగా వ్యవహరించారు. అయితే అసలు జబర్దస్త్ షోకి యాంకర్ గా మొట్టమొదట ఆఫర్ వచ్చింది తనకే అంటోంది స్టార్ యాంకర్ శ్రీముఖి. జబర్దస్త్ షో ప్రారంభం అవుతుంది అనగా యాంకరింగ్ కోసం అనసూయ కంటేముందు ముందు నాకే కాల్ చేశారంటోందీ అందాల తార. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ షో గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..

‘మల్లెమాల సంస్థ ద్వారానే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అలా జబర్దస్త్ షోకి యాంకర్ గా మొట్టమొదట ఆఫర్ నాకే వచ్చింది. జబర్దస్త్ షో ప్రారంభం అవుతుంది అనగా యాంకరింగ్ కోసం ముందు నాకే కాల్ చేశారు. అదే సమయంలో నాకు వంశీ గారి దర్శకత్వంలో ‘తను మొన్నే వెళ్లిపోయింది’ అనే చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. వంశీ గారి సినిమా అంటే ఎవరూ మిస్ చేసుకోరు కదా. దీనితో ఈ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని అనుకున్నా. అయితే సరిగ్గా ఇదే సమయంలో జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది.
అయతే కామెడీ షో కాబట్టి ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, షోలో నాపై సెటైర్లు వేస్తారేమోనన్న అనుమానాలు, భయాలు ఉండేవి. దీనితో జబర్దస్త్ చేయలేను అని చెప్పా. అయితే నా దురదృష్టం కొద్దీ వంశీ సినిమా కూడా బాగా లేట్ అయిపోయింది. చివరికీ సినిమాలో నా బదులు వేరే హీరోయిన్ ను తీసుకున్నారు. ఇక అనసూయ కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి తప్పుకుంది. అప్పుడు కూడ మళ్లీ నన్ను అడుక్కున్నారు. కనీసం మూడు ఎపిసోడ్స్ అయినా చేయండి ఆ తర్వాత వేరే యాంకర్ ని తీసుకుంటాం అని అడిగారు. అయితే స్టేజీపై నాపై సెటైర్లు వేస్తే నేను లైట్ గా తీసుకోలేను. ఏడ్చేస్తాను. అందుకే నో చెప్పా. దీనితో ఆ ఛాన్స్ రష్మీ గౌతమ్ కి వెళ్లింది’ అని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్టార్ యాంకర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us