పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలుసిందే. ఆయా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు పవన్. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వినోదయ సిత్తం సినిమా రీమేక్ లో నటిస్తున్నారు పవన్ సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫోటోలు కూడా లీక్ అయ్యి వైరల్ గా మారాయి. అలాగే సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు భామలు నటించనున్నారట.
ఇక ఈ సినిమా తమిళ్ సినిమా తేరికి రీమేక్ అని తెలుస్తోంది. తమిళ్ లో దళపతి విజయ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయనున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ అందుకున్న భామలు ఎవరంటే..
పవన్ సరసన హీరోయిన్స్ గా శ్రీలీల, మాళవిక మోహన్ నటించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. శ్రీలీలకు కెరీర్ బిగినింగ్ లోనే ఇలా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పట్లో ఈ అమ్మడికి తిరుగు లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమానుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.