Sreeleela: హీరోయిన్ శ్రీలీలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా?

గతేడాది అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ తో ఆడియెన్స్ ను పలకరించింది శ్రీలీల. ఇప్పుడు నితన్ తో కలిసి రాబిన్ హుడ్ సినిమాతో మరోసారి మన ముందుకు వచ్చింది. ఉగాది కానుకగా వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Sreeleela: హీరోయిన్ శ్రీలీలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా?
Sreeleela

Updated on: Apr 02, 2025 | 6:03 PM

గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీలీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ‘కిస్సిక్’ అంటూ కుర్రకారు మనసులు గెల్చుకుంది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా రాబిన్ హుడ్ సినిమాతో మన ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించాడు. అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఉగాది కానుకగా రిలీజైన రాబిన్ హుడ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో శ్రీలీలకు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే వరుసగా పరాజయాలు ఎదురవుతున్నప్పటికీ ఈ యంగ్ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోందీ అందాల తార. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం సిక్కింలో ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీ కరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కూడా పాల్గొంటున్నారు.

తాజాగా సినిమా యూనిట్ అంతా కలిసి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా కొన్ని బహుమతులు అందజేశారు. మూవీ షూటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని చిత్ర బృందానికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సిక్కిం సీఎంఓ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా డైరెక్టర్ అనురాగ్ బసు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ షూటింగ్‌ సమయంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు హీరో కార్తీక్ ఆర్యన్ . సిక్కింలోని ప్రకృతి దృశ్యాలు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనను ఎంతగానో ఆకర్షించాయని హీరోయిన్ శ్రీలీల తెలిపింది. ఈశాన్య రాష్ట్రానికి తన మొదటి పర్యటనను నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.

బహమతులతో శ్రీలీల, కార్తిక్ ఆర్యన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.