Sreeleela: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు చాలా ఇష్టమట..

|

Mar 23, 2023 | 3:05 PM

తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది. ఇక ఈ చిన్నదాని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ లో ఈ బ్యూటీ దుమ్మురేపుతోంది.

Sreeleela: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు చాలా ఇష్టమట..
Sree Leela
Follow us on

ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది. ఇక ఈ చిన్నదాని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ లో ఈ బ్యూటీ దుమ్మురేపుతోంది. ఇక సెకండ్ సినిమా మాస్ రాజా నటించిన ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు నటసింహం బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ నటిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ఈ బ్యూటీ కోసం కుర్ర హీరోల తో పాటు స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తన ఫెవరెట్ హీరో ఎవరో చెప్పేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. తన ఫెవరెట్ హీరో ఎవరో చెప్పింది. ఈ ముద్దుగుమ్మకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టమట. “నేను మొదటి నుండీ బాలకృష్ణకు వీరాభిమానిని. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం చూశాక ఇప్పుడు ఇంకా అభిమానిని అయ్యాను” అని చెప్పుకొచ్చింది.

అనిల్ రావిపూడి దర్శకత్వలో బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఉగాది పండగ సందర్భంగా బాలయ్య లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురిగా కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవలే శ్రీలీల, కాజల్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు కూడా. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.