Sreemukhi: వాటే లక్.. శ్రీముఖికి క్రేజీ ఆఫర్.. ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్

లీడింగ్ యాంకర్‌గా రెగ్యూలర్‌గా టీవీల్లో కనిపించే శ్రీముఖి ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా సినిమాలో ఆఫర్ అందుకుందట. గతంలో ఆమె జులాయి, నేను శైలజా సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

Sreemukhi: వాటే లక్.. శ్రీముఖికి క్రేజీ ఆఫర్.. ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్
Sreemukhi

Updated on: Apr 05, 2024 | 9:53 PM

తెలుగు స్టార్ యాంకర్ శ్రీముఖికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కడున్నా సందడే. బుల్లితెర రాములమ్మగా బాగా పాపులర్ అయింది. ఇక లేటెస్ట్​ ఫొటో షూట్​లతో సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తూనే ఉంటుంది. గతంలో ఆమె జులాయి, నేను శైలజా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మంచి పేరు తెచ్చుకుంది . అయితే ఈ స్టార్ యాంకర్ ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఐకాన్ స్టార్  అల్లు అర్జున్- అట్లీ కాంబోలో పాన్ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న చిత్రంలో శ్రీముఖి మంచి పాత్రలో కనిపించనుందట. ఈ మూవీలో కూడా బన్నీకి సిస్టర్​ రోల్​లో రాములమ్మ కనిపించనుందట. గతంలో వీరిద్దరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయిలో అన్నాచెల్లెళ్లుగా నటించిన విషయం తెలిసిందే.  ఇక ఈ మూవీకి మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్​గా షురూ అవ్వనుంది.

ఇక శ్రీముఖి చివరగా చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో ఖుషీ నడుము సీన్ రీక్రియేట్ చేసి థియేటర్లలో తెగ సందడి చేసింది.  బిగ్ బాస్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ స్టార్ యాంకర్ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా అవార్డు అందుకోవడంతో పాటు, చిరు ప్రశంసలు కూడా అందుకోగలిగింది. కొన్ని నెలలుగా శ్రీముఖి..  ఓ యంగ్ హీరోతో లవ్‌లో ఉందని టాలీవుడ్ లో రూమర్లు వినిపిస్తుండగా, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు సర్కులేట్ అయ్యాయి. దానికంటే ముందు యాంకర్ ప్రదీప్‌కు, శ్రీముఖికి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వారు క్లారిటీ ఇచ్చారు.