Childhood Pic: తాతగారితో గారాల మనవడు ఈ చిన్నారి బాలుడు.. ఆంధ్రుల అభిమాన నటుడు ఎవరో గుర్తు పట్టారా..

|

Oct 20, 2021 | 10:13 AM

Childhood Photo: మనకు ఇష్టమైన వ్యక్తులు చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా సినీ హీరో, హీరోయిన్లు, క్రీడాకారుల ఫ్యాన్స్..

Childhood Pic: తాతగారితో గారాల మనవడు ఈ చిన్నారి బాలుడు.. ఆంధ్రుల అభిమాన నటుడు ఎవరో గుర్తు పట్టారా..
Childhood Photo
Follow us on

Childhood Photo: మనకు ఇష్టమైన వ్యక్తులు చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా సినీ హీరో, హీరోయిన్లు, క్రీడాకారుల ఫ్యాన్స్ అయితే తాము అభిమానించే వ్యక్తులకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. తమకు ఇష్టమైన వారి చిన్నతనంలోని ఫోటోలను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. తాజాగా ఓ దివంగత స్టార్ హీరో చిన్నతనంలోని ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాతగారు పక్కన అమాయకంగా నవ్వుతున్న ఆ చిన్నారి బాలుడు.. కాలక్రమంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఖ్యతిగంచారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ఓ చరిత్ర సృష్టించి.. తెలుగు వాడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. అవును నందమూరి అందగాడు ఆంధ్రుల అన్నగారు నందమూరి తారకరామారావు తన తాతగారైన రామస్వామి చౌదరితో ఉన్నప్పటి ఫోటో. తాత రామస్వామితో గారాల మనుమడు, చిరు ప్రాయంలో చిన్నారి నందమూరి తారకరామారావు ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా, గుడివాడ తాలుకా నిమ్మకూరు గ్రామంలోని నందమూరి వంశంలో 28 మే 1923న ఎన్టిఆర్ జన్మించారు. యన్.టి.ఆర్ తాత అనగా తండ్రికి తండ్రి రామస్వామి చౌదరి..మహాలక్ష్మమ్మలకు నలుగురు కొడుకులు. వారిలో రెండో సంతానం లక్ష్మయ్య చౌదరి.. ఎన్టిఆర్ తండ్రి లక్ష్మయ్యకు పొట్టిపాడు గ్రామానికి చెందిన కాట్రగడ్డ సూరయ్య రెండో కూతురు పుత్రిక వెంకట్రావమ్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. నందమూరి తారక రామారావు, నందమూరి త్రివిక్రమరావు. చిన్నతనంలో తాత రామస్వామి చౌదరి దగ్గర రామారావు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగారు. ఇక 1928 లో నటుడు రాజేంద్ర ప్రసాద్ తాతగారు వీధి బడిపంతులు గద్దె వెంకట సుబ్బయ్య వద్ద అక్షరాలు దిద్దుకున్నారు.

Ntr Photo

కాలక్రమంలో మనదేశం సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 400 చిత్రాలలో నటించారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు అనేక సినిమాలను నిర్మించారు. మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. కత్తి పట్టి జానపద హీరోగానే కాదు,, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టిఆర్ వు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే అధికారాన్ని దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.

Also Read:  నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు, వరదలు.. కొండచరియలు విరిగిపడి 21మంది మృతి