
మన సెలబ్రిటీలు కూడా బిజినెస్‌ల మీద గట్టిగానే కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. సినిమా నిర్మాతలుగా కొందరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. మరికొందరు సినిమాకు ఏమాత్రం సంబంధం లేని సరికొత్త రంగాల్లోనూ ఎస్టాబ్లిష్ కావడానికి మొగ్గుచూపుతున్నారు. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. మరోవైపు.. వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబులతోపాటు.. ఇప్పటి కుర్ర హీరోలు కూడా నచ్చిన రంగాల్లో రాణించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, చైతూ వంటి కుర్రహీరోస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న బిజినెస్ ఎంటో తెలుసుకుందామా.
Mahesh babu
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు బిజినెస్ రంగం కొత్తేం కాదు. ఇప్పటికే నిర్మాణ రంగంలోనూ, థియేటర్ బిజినెస్‌లోనూ ఉన్నారు ఘట్టమనేని హీరో. టెక్స్ టైల్స్ బిజినెస్‌లోనూ ఉన్నారు మహేష్. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన భార్య నమ్రత హోటల్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు. మినర్వ ఏఎన్ పేరుతో బుధవారం ఈ హోటల్‌కి పూజా కార్యక్రమాలు చేశారు. ఎంజాయ్ ద ఫుడ్ అంటూ నమ్రత పెట్టిన పోస్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సంపాదించడం మాత్రమే కాదు, ఆ సంపాదనను సరికొత్త దారుల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఓ కళ. ఆసక్తి ఉన్న రంగంలో పెట్టిన పెట్టుబడి ఎప్పుడూ వృథా కాదు. తప్పక సక్సెస్ చూస్తారంటూ విష్‌చేస్తున్నారు నమ్రతామహేష్ వెల్‌విషర్స్.
Allu arjun
బిజినెస్ రంగంలో సత్తా చూపిస్తున్న హీరోల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ రోలో ఉంటారు అల్లు అర్జున్. సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన అల్లు అర్జున్, మరింత ముందు చూపుతో ఆలోచించారు. ఫ్యాషన్ రంగంలో ముందుండే బన్నీకి పబ్ కల్చర్ మీద కూడా మంచి అవగాహన ఉంది. అటు ఓటీటీ రంగంలోనూ దూసుకుపోతున్నారు అల్లు అర్జున్. అల్లు ఆర్మీకి బీ డబ్స్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇటీవల మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకీ ఎంట్రీ ఇచ్చారు అల్లుస్టార్.
Vijay devarakonda
మధ్య తరగతి జీవితం గురించి నాకు చాలా బాగా తెలుసు అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారీ చెబుతుంటారు విజయ్ దేవరకొండ. పైసా విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి, ప్రతి రూపాయినీ జాగ్రత్త చేస్తున్నారు. ఆల్రెడీ నిర్మాణ రంగంలో ఉన్నారు విజయ్. మహబూబ్‌నగర్‌లో ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ కూడా ఉంది విజయ్‌కి. రౌడీ వియర్ పేరుతో టెక్స్ టైల్ బ్రాండ్‌ని ఎస్టాబ్లిష్ చేశారు విజయ్ దేవరకొండ.
Prabhas
ప్యాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిన ప్రభాస్‌కి ఏం వ్యాపారాలున్నాయి? అప్పుడెప్పుడో హైదరాబాద్ పరిసరాల్లో స్థలానికి సంబంధించిన వార్తలు తప్పితే, ఆయన బిజినెస్‌లు గురించి పెద్దగా విషయాలు బయటకు రావేం అని అనుకునేవారున్నారు. యువీ ప్రొడక్షన్స్ కి ప్రభాస్ సపోర్ట్ ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అది కాకుండా ప్రభాస్ హాస్పిటాలిటీ రంగంలోకి రావాలని అనుకుంటున్నారనే వార్తలు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Chiranjeevi
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్నది మెగాబాస్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ మంత్రం మాత్రమే కాదు, బిజినెస్ రంగంలోనూ సేమ్ ఫార్ములానే ఫాలో అవుతుంటారాయన. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి కొలీగ్ నాగార్జునతో కలిసి రంగప్రవేశం చేశారు చిరు. చిరు అండ్ నాగార్జున కేరళ బ్లాస్టర్స్ టీమ్‌కి కో ఓనర్లుగానూ వ్యహరించారు. ఫుల్‌బాల్ టీమ్‌ని మన స్టార్లు తీసుకోవడం అప్పట్లో ఫ్యాన్స్ కి కూడా బిగ్ న్యూస్.
Nagarjuna
టాలీవుడ్ హీరోల్లో అదర్‌దేన్ సినిమా బిజినెస్‌లున్న హీరోగా నాగార్జునకి ఎప్పటినుంచో పేరుంది. ఎన్ కన్వెన్షన్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అంటూ యూత్‌కి ఇన్‌స్పిరేషనల్‌గా ఉన్నారు అక్కినేని కింగ్. నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని చైతన్య కూడా హోటల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓన్ క్లౌడ్ కిచెన్ బ్రాండ్ షోయు ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్ టాపిక్. ప్యాన్ ఏషియన్ కిచెన్ లో స్పెషల్ డిషెస్ చాలానే ఉన్నాయట. స్వతహాగా చైతన్యకు వంట చేయడమంటే చాలా ఇష్టం. ఆ అభిరుచితోనే షోయుని స్టార్ట్ చేశారు చైతూ.
Ram Charan
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ కూడా బిజినెస్ మీద మంచి ఇంట్రస్ట్ ఉన్న వ్యక్తే. హైదరాబాద్ పోలో టీమ్, రైడింగ్ క్లబ్, ట్రూ జెట్ ఎయిర్‌లైన్ సర్వీసుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ రామ్‌చరణ్ వార్తల్లో వ్యక్తి అవుతుంటారు. అందరికీ ఉండేవి 24 గంటలే. కానీ ఆ సమయంలోనే వర్క్ నీ, ప్యాషన్‌నీ బ్యాలన్స్ చేయడం… అందులోనూ బిజినెస్‌లో నెగ్గుకు రావడం మామూలు విషయం కాదు. ఇలాంటి పెద్ద పెద్ద టాస్కులను కూడా ఈజీగానే హ్యాండిల్ చేస్తున్నారు మన సెలబ్రిటీలు. ఇదీ ఇవాళ్టి మూవీ స్పెషల్ సైడ్ బిజినెస్.