Soundarya Rajinikanth: ఆయనే నా ధైర్యం, బలం.. కుమారుడి ఫొటోను షేర్‌ చేస్తూ సౌందర్య రజనీకాంత్‌ ఎమోషనల్‌

|

Sep 23, 2022 | 9:11 AM

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ ఇటీవల రెండోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే. విషంగన్‌ వనంగమూడితో కలిసి ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Soundarya Rajinikanth: ఆయనే నా ధైర్యం, బలం.. కుమారుడి ఫొటోను షేర్‌ చేస్తూ సౌందర్య రజనీకాంత్‌ ఎమోషనల్‌
Soundarya Rajinikanth
Follow us on

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ ఇటీవల రెండోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే. విషంగన్‌ వనంగమూడితో కలిసి ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ శుభవార్తను పంచుకుంటూ తమ బిడ్డకు వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి అని తాత పేరు కలిసేలా నామకరణం చేసినట్లు పేర్కొంది. కాగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది సౌందర్య. ఇందులో సౌందర్య మెడలో పూల దండ వేసుకుని కనిపించగా.. ఆమె కుమారుడు వీర్‌తో పాటు రజనీకాంత్‌ కూడా ఉన్నారు. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్‌ తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది భగవంతుడు నన్ను అద్భుతమైన బహుమతితో దీవించాడు. అది నా బిడ్డ వీర్‌. అలాగే ఆ దేవుడు ఇచ్చిన మరో అద్భుతమైన వరం ఎప్పుడూ నా వెనకాలే ఉంటూ నాకు అండగా నిలుస్తోంది. ఆయనే నా ధైర్యం, బలం, ఆశీర్వాదం’ అంటూ తండ్రి రజనీకాంత్‌ను ఉద్దేశించి భావోద్వేగానికి గురైంది సౌందర్య.

కాగా 2010లో ఆమెకు అశ్విన్‌ రామ్‌కుమార్‌ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది సౌందర్య. 2015లో వీరి జీవితంలోకి వేద్‌ కృష్ణ అడుగుపెట్టాడు. అయితే 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2019లో నటుడు, వ్యాపారవేత్త విషంగన్‌ వనంగమూడితో కలిసి రెండోసారి పెళ్లిపీటలెక్కింది. తాజాగా వీరిద్దరికి వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి జన్మించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..