SonuSood: రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు చేసే ఆ నటుడు రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యాడు. కరోనా భారత్ ను కమ్మేసిన వేళ….నేనున్నానంటూ కదిలాడు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడ వాలిపోతున్నాడు. అడిగిన వెంటనే కాదనకుండా సాయం చేస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచాడు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు అంతా ఆయన వైపే చూస్తున్నారు. సోనూ బాయ్ అంటే…సాయం చేసే గాడ్ అని కొలుస్తున్నారు.
సోనూసూద్.. ఎవరికీ ఏ అవసరం వచ్చినా గుర్తొస్తున్న పేరు. దేశమంతా ఇప్పుడు ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్ లో కష్టాలు పడుతున్న పేదలను చూసి సేవకుడిగా బయలుదేరాడు. లాక్ డౌన్ టైమ్‌లో ఇండస్ట్రీ షట్‌డౌన్ అయి స్టార్స్ అంతా ఖాళీగా ఉంటే… సోనూసూద్ మాత్రం ఫుల్ బిజీ అయ్యారు. మొదటి వేవ్ టైమ్‌లో వేల మంది వలస కార్మికులకు సాయం చేసిన సోనూ… రియల్ హీరో అనిపించుకున్నారు. సెకండ్ వేవ్‌లో సేవ కార్యక్రమాల్లో మరింత బిజీ అయ్యారు. అడిగిన వారందరికి సొంత ఖర్చులతో సాయాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సోనూ సూద్ పీఎం కావాలన్న డిమాండ్ కూడా మొదలైంది. అయితే సోనూ మాత్రం తనకు సామాన్యుడిగా సాయం చేయటమే ఇష్టమంటూ చెప్పారు. పదవుల మీద ఆశలేదు.. సాయం చేయటం నాకు ఇష్టం అంటూ సైలెంట్‌గా సైడయ్యారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్, మెడిసిన్ అందక కష్టాలు పడుతున్న వారికి తనవంతు సాయం అందిస్తున్నారు ఈ రియల్ హీరో. సామాన్యులే కాదు… సెలబ్రిటీలు కూడా సోనూ వల్ల సాయం పొందుతున్నారు. అలా ఎందరో ప్రాణాలు కాపాడిన సోనూసూద్‌ను దేవుడితో పోలుస్తున్నారు ప్రజలు. ఆయన సేవలు పొందిన వారు ఎంతోమంది సోనూ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారు. తమ పిల్లలకు సోనూసూద్ అని పేరు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఈ సేవా కార్యక్రమాలతో సోనూ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. దీంతో ఇన్నాళ్లు నెగెటివ్ రోల్స్ చేసిన ఈ టాలెంటెడ్ స్టార్‌ని ఇప్పుడు విలన్‌గా చూపించేందుకు కూడా భయపడుతున్నారు మేకర్స్. జనాల్లో రియల్ హీరో ఇమేజ్ ఉన్న నటుడు తెర మీద విలన్‌లా కనిపిస్తే యాక్సెప్ట్ చేయరేమో అని భయపడుతున్నారట.
Ram Pothineni: దేవదాసుగా ఎంట్రీ ఇచ్చి ఎనర్జిటిక్ స్టార్‌గా మారిన రామ్.. రాపో సినీ ప్రస్థానం..