Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ పై నార్త్ రైల్వే సీరియస్.. అలాంటి పనులు చెయ్యొదంటూ..

కష్టం అన్నవారికి కాదనకుండా లేదనకుండా సాయం అందించారు సోనూ సూద్. దాంతో దేశమంతా సోనూసూద్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వాలు సైతం ఆయనను కొనియాడాయి.

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ పై నార్త్ రైల్వే సీరియస్.. అలాంటి పనులు చెయ్యొదంటూ..
Sonu Sood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 05, 2023 | 2:46 PM

చేసింది విలన్ వేషాలే అయిన నిజజీవితంలో మాత్రం దేవుడిగా ప్రజలచేత కీర్తించబడ్డాడు సోనూ సూద్. కరోనా  మహమ్మారి విరుచుకుపని ఆసమయంలో ప్రజలకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు. బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయించి.. ప్రజలను సొంత ఊర్లకు పంపించాడు. అలాగే కష్టం అన్నవారికి కాదనకుండా లేదనకుండా సాయం అందించారు సోనూ సూద్. దాంతో దేశమంతా సోనూసూద్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వాలు సైతం ఆయనను కొనియాడాయి. అయితే ఇప్పుడు సోనూ సూద్ పై నార్త్‌ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనూ చేసిన పనికి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దంటూ హెచ్చరించింది. ఇంతకు సోనూ సూద్ ఏం చేశారంటే.. ఇటీవల సోనూసూద్ ట్రైన్ లో ప్రయాణించారు.

రైల్ లో ప్రయాణించే సమయంలో ఆయన డోర్ దగ్గర కూర్చొని ఉన్నారు. అయితే రైల్ కదిలేసమయంలో డోర్ దగ్గర కూర్చోవడం ప్రమాదకరం. దీని పై నార్త్ రైల్వే సీరియస్ అయ్యింది. సోనూ ఫుట్ బోర్డు పై కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియో చూసిన నార్త్‌ రైల్వే అధికారులు ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

‘డియర్‌ సోనూసూద్‌.. మీరు ప్రపంచంలో ఉన్న మిలియన్ల మందికి రోల్ మోడల్ అయ్యారు. రైలు ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలను మీ ఫ్యాన్స్ అనుసరించవచ్చు. దయచేసి ఇలా చేయకండి. జాగ్రతగా ప్రయాణించండి. అని నార్త్ రైల్వే ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అదేవిధంగా ముంబై రైల్వే కమిషనర్‌ కూడా దీని పై స్పందించింది. సోనుసూద్‌ ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం మీ సినిమాలోని ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఓ పార్ట్ కావచ్చు. కానీ నిజ జీవితంలో మాత్రం కాదు.  సురక్షితంగా ప్రయాణించి ‘హ్యాపీ న్యూ ఇయర్‌ని ఆస్వాదించండి’’ అని జీఆర్‌పీ ముంబై తమ ట్వీట్‌ చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.