Sonu Sood: రోటీవాలాగా మారిన సోనూ సూద్.. ఇక్కడ రోటీ తింటే.. మరెక్కడా తినడానికి ఇష్టపడరంటున్న రియల్ హీరో

|

Jul 27, 2021 | 10:07 AM

Sonu Sood: సామాన్యుడి స్థాయి నుంచి కష్టపడి పనిచేస్తూ.. అంబరాన్ని అందుకునే స్టేజ్ చేరుకున్నవారు చాలామంది ఉన్నారు.. అయితే కొంతమంది మాత్రమే.. తాము పడిన

Sonu Sood: రోటీవాలాగా మారిన సోనూ సూద్.. ఇక్కడ రోటీ తింటే.. మరెక్కడా తినడానికి ఇష్టపడరంటున్న రియల్ హీరో
Sonu Sood
Follow us on

Sonu Sood: సామాన్యుడి స్థాయి నుంచి కష్టపడి పనిచేస్తూ.. అంబరాన్ని అందుకునే స్టేజ్ చేరుకున్నవారు చాలామంది ఉన్నారు.. అయితే కొంతమంది మాత్రమే.. తాము పడిన కష్టాలను గుర్తు పెట్టుకుని.. ఇతరులకు సాయం అందిస్తారు. అలాంటి వారిలో ఒకరు సోనూ సూద్. కరోనా కష్టకాలంలో మొదలైన దాతృత్వ పర్వం.. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో రీల్ నటుడు కాస్త రియల్ గా మారారు.. దేశ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని స్వస్థలాలకు చేర్చిన సోనూ సూద్ తర్వాత కూడా ఎవరైనా సాయం అని అడిగిన వెంటనే అందిస్తూనే ఉన్నారు.. సోషల్ మీడియా ద్వారా అడిగినవారికి.. అడగని వారికీ తనతోచిన విధంగా సాయం అందిస్తూ.. కలియుగ దానకర్ణుడు అనిపించుకున్న్నారు.. అయితే సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు వీడియో లు షేర్ చేస్తూ సందడి చేసే సోనూ .. అందులో కూడా ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటారు.. సూపర్ మార్కెట్ డెలివరీ బాయ్ , రిక్షావాలాగా మారినా అందులో ఎదుటివారి కష్ట నష్టాలను గురించి తెలుసుకోవడం కోసమే.. అలాంటి సోనూ కాగా తాజాగా పంజాబీ ధాబా కూడా ఓపెన్ చేసి అందులో స్వయంగా రోటీలు చేసి అమ్ముతున్నారు.

చిరు వ్యాపారులను ప్రోత్సహించే దిశగా సోనూ సూద్ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు.. సోనూ చేసిన రోటీలు తింటే మర్చిపోలేరని.. ఒకసారి ఇక్కడ రోటీలు తిన్నవారు.. ఇక మళ్ళీ ఇంకెక్కడా తినలేరని కామెంట్ ను జత చేసి ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే.. ఇదంతా తన లాభం కోసం కాదు. చిరు వ్యాపారులను ప్రమోట్ చేసే పనిలో భాగంగా సోనూసూద్ ఇలా వారికి ఫ్రీగా ప్రచారం చేస్తున్నాడు. సరసమైన ధరలకు ఇక్కడ పప్పు, రొట్టెలు లభించును అని క్యాషన్ పెట్టిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తుంది. చిరు వ్యాపారుల ప్రోత్సహించడంలో సోను చేపట్టిన ఈ కార్యక్రమానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

ఆ మధ్య సోనూ సూద్ సూపర్ మార్కెట్ ఒకటి ఓపెన్ చేసి… వాటి రేట్లు చెప్తూ గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మడు. దానికి సోనూసూద్ సూపర్ మార్కెట్ అని పేరు కూడా పెట్టి డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది.. దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ అవుతుంది.. త్వరగా ఆర్డర్ చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 

Also Read: Ayurveda Curd: పెరుగు తినడం ఇష్టం లేదా.. మీరు ఎన్ని ఆరోగ్య ప్రయోజలు మిస్ అవుతున్నారో తెలుసా..!