Tumbbad: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ భయపెట్టేందుకు వస్తోన్న తుంబాడ్.. థియేటర్లలో రీ-రిలీజ్ ఎప్పుడుంటే?

|

Aug 26, 2024 | 12:17 PM

తుంబాడ్ చిత్రం మొదట అక్టోబర్ 12, 2018న విడుదలైంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 13.6 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో 3 అవార్డులను గెలుచుకుంది. ఓటీటీలో అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ రేటెడ్ హారర్ చిత్రాలు అని సెర్చ్ చేస్తే

Tumbbad: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ భయపెట్టేందుకు వస్తోన్న తుంబాడ్.. థియేటర్లలో రీ-రిలీజ్ ఎప్పుడుంటే?
Tumbbad Movie
Follow us on

శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆగస్ట్ 15న ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాలీవుడ్ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఇండియాలో వసూళ్ల పరంగా ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌లో చేరింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ హారర్ మూవీ సక్సెస్ చూసి మరో హారర్ మూవీని థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అదే తుంబాడ్.. ఆగస్ట్ 30న ఈ టాప్ రేటెడ్ హారర్ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నారు. ఈ మూవీకి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సోహమ్ షా, హరీష్ ఖన్నా, జ్యోతి మల్షే, రుద్ర సోని, మాధవ్ హరి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తుంబాడ్ చిత్రం మొదట అక్టోబర్ 12, 2018న విడుదలైంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 13.6 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో 3 అవార్డులను గెలుచుకుంది. ఓటీటీలో అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ రేటెడ్ హారర్ చిత్రాలు అని సెర్చ్ చేస్తే కచ్చితంగా తుంబాడ్ సినిమా కనపిస్తుంది. ఐఎండీబీలో ఈ చిత్రానికి 8.2/10 రేటింగ్ కూడా ఉంది. సుమారు 62 వేల మంది ఈ చిత్రానికి ఆ రేటింగ్ ఇవ్వడం విశేషం.

 

ఇవి కూడా చదవండి

తుంబాడ్ చిత్రాన్ని రూపొందించడానికి నిర్మాతలు 6 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ సినిమా షూటింగ్ 2012లో మొదలు కాగా 2018లో విడుదలైంది. ఇక తుంబాడ్ సినిమా కథ విషయానికి వస్తే.. 1918లో మహారాష్ట్రలోని కలమేడ్ గ్రామంలో ప్రారంభమవుతుంది. వినాయక్ రావు (సోహం షా) తన తల్లి, సోదరుడితో కలిసి ఈ గ్రామంలో ఉంటాడు. ఊరి గుడిలో నిధి దాగి ఉందన్న వార్త విని దాని కోసం వెతుకుతుంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమాలో ఊహించని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ను అందిస్తాయి.

ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లో రీ రిలీజ్ లట్రెండ్ మొదలైంది. ఇటీవల మహేశ్ బాబు మురారి, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలు థియేటర్లలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అటు బాలీవుడ్ లో కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల తృప్తీ ధిమ్రీ నటించిన లైలా మజ్నూ, రణబీర్ కపూర్ రాక్ స్టార్ ని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి తుంబాడ్ కూడా చేరింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.