‘ఎక్స్​పైరీ డేట్’ తో రాబోతున్న స్నేహా ఉల్లాల్‌

స్నేహా ఉల్లాల్‌ను చిన్న ఐశ్వ‌ర్య‌రాయ్ అని అంద‌రూ ముద్దుగా పిలుచుకుంటారు. అందంలోనూ, అభిన‌యంలోనూ స్నేహ..ఐశ్‌కు ఏమాత్రం త‌క్కువ కాదు.

ఎక్స్​పైరీ డేట్ తో రాబోతున్న స్నేహా ఉల్లాల్‌

Updated on: Sep 01, 2020 | 9:08 AM

స్నేహా ఉల్లాల్‌ను చిన్న ఐశ్వ‌ర్య‌రాయ్ అని అంద‌రూ ముద్దుగా పిలుచుకుంటారు. అందంలోనూ, అభిన‌యంలోనూ స్నేహ..ఐశ్‌కు ఏమాత్రం త‌క్కువ కాదు. కానీ ఎందుకో స్నేహ ఉల్లాల్ సినిమా ఇండ‌స్ట్రీలో అంత‌గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. దీంతో గ‌త‌ కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న ఆమె.. త్వ‌ర‌లో ‘ఎక్స్​పైరీ డేట్’ వెబ్​ సిరీస్​తో ఆడియెన్స్‌ను ప‌లుక‌రించ‌బోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సిరీస్.. అక్టోబరు చివర్లో రిలీజ్ కానుంది.

మొద‌ట‌ జూన్​లో ప్రేక్ష‌కుల ముందుగా తీసుకురావాల‌ని అనుకున్నా, క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా అదికాస్త వాయిదా పడింది. ఈమెతో పాటు మధు షాలినీ, అలీ రెజా, భరత్ రెడ్డి తదితరులు ఈ సిరీస్​లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. శరత్ మరార్ నిర్మించ‌గా, శంకర్ మార్తాండ్ దర్శకత్వం వ‌హించారు. తన వైఫ్‌ను హింసాత్మకంగా మ‌ర్డ‌ర్ చేసిన ఓ వ్యక్తి జీవితంలో తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనే ప‌రిణామాల‌తో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కింది.

 

Also Read :

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

ఏపీలో పింఛ‌న్లు : నేటి నుంచే మ‌ళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి

అలెర్ట్ : దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు