AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani: ఇండస్ట్రీలో 8 గంటల పని విధానంపై స్పందించిన స్మృతి ఇరానీ.. దీపిక గురించి ఏం చెప్పారంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రతిపాదించిన 8 గంటల పని విధానంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. వర్కింగ్ అవర్స్ విషయంలో కొందరు దీపికకు మద్దతుగా మాట్లాడుతుంటే మరికొందరు ఆమెను విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తాజాగా ఇదే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Smriti Irani: ఇండస్ట్రీలో 8 గంటల పని విధానంపై స్పందించిన స్మృతి ఇరానీ.. దీపిక గురించి ఏం చెప్పారంటే?
Smriti Irani, Deepika Paduko
Basha Shek
|

Updated on: Oct 15, 2025 | 12:18 PM

Share

దీపిక పదుకొనే 8 గంటల పని విధానంపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ 2 టీవీ సీరియల్ లో నటిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మళ్లీ స్మృతి నటిస్తున్న సీరియల్ ఇది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె దీపిక ప్రతిపాదించిన 8 గంటల పనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది పూర్తిగా దీపిక పదుకొనే వ్యక్తిగత విషయం. కానీ నటులు నిర్మాతల బాగోగులు కూడా చూసుకోవాలి. కొన్ని వివాదాలు కేవలం సంచలనం కోసం సృష్టిస్తారు. అటువంటి విషయాలలో పాల్గొనేంత అమాయకురాలిని కాదు నేను. కానీ నిర్మాతలను చూసుకోవాలి, వాళ్లకు నష్టం రాకుండా చూసుకోవడం నటులుగా మా బాధ్యత. ఈ రోజు పని చేయాలని నాకు అనిపించడం లేదని చెప్పడం వృత్తిపరంగా ఆమోదయోగ్యం కాదు.. సీరియల్స్ చేస్తున్నపుడే రెండుసార్లు నేను గర్భం దాల్చాను.. అప్పుడు కూడా పని చేసాను. ఒక్క రోజు మనం రాకపోతే 120 మందికి ఆ రోజు చెక్కు అందదు. అది 120 కుటుంబాలకు అన్యాయం అవుతుంది. నటిగా ఉండటం, రాజకీయాల్లో ఉండటం, తల్లిగా ఉండటం అనేవి నా ఛాయిస్.. దానిపై బాధ్యత నాదే.. అదే సమయంలో నటులుగా మనం చేసే పనిపై నిబద్ధత కూడా ఉండాలి’ అంటూ ఇన్ డైరెక్టుగా దీపిక కు కౌంటర్ ఇచ్చారు స్మృతి.

ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన దీపికా పదుకొణె తరచూ వార్తల్లో నిలుస్తోంది.   ప్రభాస్ స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్స్ నుంచి ఆమె తప్పుకోవడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సరైన కారణాలేంటో తెలియదు కానీ..  సోషల్ మీడియాలో మాత్రం పలు రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి.  దీపికా కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పడం.. అలాగే అధికంగా రెమ్యునరేషన్ అడిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే దర్శక నిర్మాతలు దీపికను తమ ప్రాజెక్టుల నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సినీ ప్రముఖుల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు దీపిక కు మద్దతుగా మాట్లాడుతుంటే మరికొందరు మాత్రం ఆమెను విభేదిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా 8 గంటల పని విధానంపై స్పందించారు.

ఇవి కూడా చదవండి

స్మృతి ఇరానీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. కట్ చేస్తే 7ఏళ్ల చిన్నవాడితో
పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. కట్ చేస్తే 7ఏళ్ల చిన్నవాడితో
రిసెఫ్షన్‌లో ఇదేం రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా
రిసెఫ్షన్‌లో ఇదేం రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్
పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్
5నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో ఫుల్ ఎనర్జీ!
5నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో ఫుల్ ఎనర్జీ!
భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే?
భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే?