Thalapathy vijay: తమిళ్ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. శివకార్తికేయన్ నటించిన రెమో సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ.. ఆతర్వాత హీరోగా మారాడు. శివకార్తికేయన్‌లో యాక్టింగ్‌తో పాటు చాలా టాలెంట్లు ఉన్నాయి. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత ఇలా మల్టీ టాలెంట్లు ఉన్నాయి శివలో. అంతే కాదు పాటలు కూడా రాస్తాడు ఈ హీరో. ఇప్పటికే గేయరచయితగా పలు సినిమాల్లో శివ కార్తికేయన్ పాటలు రాశారు. దర్శకుడు నెల్సన్ శివ కార్తికేయన్‌కు మంచి స్నేహితుడు. శివ కార్తికేయన్ మొదటి నుండి నెల్సన్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఎదో ఒక విధంగా భాగం అవుతూ వస్తున్నాడు. సెల్సన్ మొదటి సినిమా కొలమావు కోసం శివ కార్తికేయన్ కల్యాణ వయసు అనే పాటను రాశారు. ఆ తర్వాత సెల్వన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమాలో అన్ని పాటలను శివనే రాసారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు దళపతి విజయ్ కోసం శివ కార్తికేయన్ పాటను రాశారు. నెల్సన్ దళపతి విజయ్‌తో కలిసి బీస్ట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిదే. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం శివకార్తికేయన్ ఓ పాట రాయనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..
Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌తో ఇలా డాన్స్‌లు
Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..