
బాలీవుడ్ భామలు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఇక్కడ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇలా చాలా మంది టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి భామల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ మృణాల్ ఠాకూర్. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది. అందం అభినయం కలబోసిన ఈ బ్యూటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో సీత పాత్రలో చక్కగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
సీతారామం సినిమాతో సక్సెస్ సాధించిన మృణాల్ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని తో కలిసి నటిస్తుంది. ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలోకి నాని ఓ పాపకు తండ్రిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అలాగే మృణాల్ విజయ్ దేవర కొండ నటిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే సీనియర్ హీరో నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ నా సామి రంగ సినిమాలోనూ మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.
అలాగే చిరంజీవి 157 లోనూ ఈ అమ్మడికి అవకాశం దక్కిందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇలా యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటుంది మృణాల్. వరుసగా టాలీవుడ్ ఆఫర్స్ రావడంతో మృణాల్ తెలుగు నేర్చుకునే పనిలో పడింది. తెలుగు క్లాస్ లు వింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మృణాల్ ఇలా ఆన్ లైన్ ద్వారా తెలుగు నేర్చుకోవడం పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.