తన గానామృతంతో యావత్ భారతీయ సమాజాన్ని ఓలలాడించిన ఓ గొంతు శాశ్వతంగా మూగవోయింది. దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్ఞిగా అప్రతిహతంగా వెలిగిన గానకోకిల వాణీజయరాం అనంత లోకాలకు తరలివెళ్ళారు. చెన్నైలోని తన స్వగృహంలో జారిపడి….విగతజీవిగా పడి ఉన్న వాణీజయరాంని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె కన్నుమూశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాయని అశేష అభిమానులను దుఃఖసాగరంలో ముంచారు. తమిళనాడు గవర్నర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వాణీజయరాం భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్ళర్పించారు. శనివారం దిగ్గజ గాయని వాణీ జయరాం మరణవార్తతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె ముఖంపై బలమైన గాయలు ఉండడం.. రక్తమడుగులో నిర్జీవంగా పడి ఉండడంతో ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారమిచ్చింది.
తన కంఠంతో దశాబ్దాల కాలం స్వరమధురిమలొలికించిన గొప్ప గాయనిని ఈ దేశం కోల్పోయింది. భారత దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్న ప్రముఖ గాయని వాణీజయరాం ఇక లేరన్న వార్త యావత్ భారత చలనచిత్ర రంగాన్ని దుఃఖసాగరంలో ముంచింది. తల, ముఖంపై బలమైన గాయాలతో రక్తమడుగులో నిర్జీవంగా పడివున్న వాణీ జయరాంను చూసి బయపడిన పనిమనిషి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో వెంటనే వాణీ జయరాం ఇంటికి వెల్లిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచారు. వాణి జయరాం మృతిని అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెపట్టారు. మరోవైపు వాణీ జయారం పోస్ట్ మార్టం పూర్తైంది.
పోస్ట్‌మార్టంలో ఆమె తలకు గాయమైనట్టు గుర్తించారు వైద్యులు. ఒకటిన్నర ఇంచు లోతు గాయమైనట్లుగా తేలింది. అయితే వాణీ జయరాం తలకు తగిలిన గాయంపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమన్నారు పోలీసులు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం వాణీ జయరాం అంత్యక్రియలు జరగనున్నాయి.