Singer Sunitha: ఆ సంఘటన తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి .. ఎమోషనల్ అయిన సునీత

ఎన్నో వేల పాటలను ఆలపించిన బాలు గొంతు.. 2021 సెప్టెంబర్25న మూగబోయింది. కరోనా మహమ్మారి కారణంగా బాలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. బాలు మరణంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా మౌనం నిండిపోయింది.

Singer Sunitha: ఆ సంఘటన తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి .. ఎమోషనల్ అయిన సునీత
Snitha

Updated on: Feb 06, 2023 | 12:01 PM

దివికేగిన సినీ దిగ్గజాల్లో ప్రేక్షకుల్లో మనస్సులో చిరంజీవిగా నిలిచిపోయే పేరు బాలసుబ్రహ్మణ్యం. తన గాత్రంతో పాటలకు ప్రాణం పోశారు బాలసుబ్రహ్మణ్యం. ఎన్నో వేల పాటలను ఆలపించిన బాలు గొంతు.. 2021 సెప్టెంబర్25న మూగబోయింది. కరోనా మహమ్మారి కారణంగా బాలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. బాలు మరణంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా మౌనం నిండిపోయింది. ఆయన అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ విషాదంలో నిండిపోయింది. అయితే సింగర్ సునీతకు బాలు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. మామయ్య అంటూ సునీత ఆయనను ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. ఎస్పీబీ మరణంతో సునీత ఎంతో మనోవేదనకు గురయ్యారు. పలు ఇంటర్వ్యూల్లోనూ బాలు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

తాజాగా మరోసారి ఆమె బాలసుబ్రహ్మణ్యంని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నాను. ఆ తర్వాత నాకు కన్నీళ్లు రావడం ఆగిపోయాయి అని అన్నారు సునీత.. అంతకు మించి గుండెను పిండేసే సంఘటనలు ఇంకా ఏముంటాయి? అనిపించింది. అంతగా నన్ను ఇక ఏ సంఘటనలు కదిలించడం లేదు. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకి మనమిచ్చే గౌరవం.. ఆయన జ్ఞాపకాలతో .. గడిపేయడమే” అని అన్నారు సునీత.

అదేవిధంగా సునీత తన జీవితం గురించి మాట్లాడుతూ.. ”నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి .. బాధ్యతలు ఉన్నాయి. నన్ను విమర్శించేవారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాను.. నేను ఏం చేయగలనో .. ఏం చేయాలో తెలుసు.  ఆ క్లారిటీ నాకు ఉంది అని తెలిపారు సునీత