Singer Sunitha: పుత్రికోత్సాహంలో సింగర్ సునీత.. అందమైన పాటపాడిన శ్రేయ.. వీడియో వైరల్

టాలీవుడ్ లో అందాల సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధురమైన తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుంకుంది. తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టు

Singer Sunitha: పుత్రికోత్సాహంలో సింగర్ సునీత.. అందమైన పాటపాడిన శ్రేయ.. వీడియో వైరల్
Sunitha

Updated on: Mar 20, 2021 | 6:26 PM

Singer Sunitha: టాలీవుడ్ లో అందాల సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధురమైన తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టు.. స్వచ్ఛమైన తెలుగు పలుకులతో సునీత అందరి అభిమాన గాయనిగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల సునీత రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా తన కూతురు శ్రేయ పడిన పాట విని ఆనందంతో మురిసిపోతుంది సునీత. సునీత కూతురు శ్రేయ సింగర్ గా తన ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది.

తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో సిధ్‌ శ్రీరాం ఆలపించిన ‘కడలల్లే వేచే కనులే ’ అనే పాటను తనదైన శైలిలో గిటార్ వాయిస్తూ పాడి అందరిని ఆకట్టుకుంది. ఆవీడియోను సునీత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు మ్యూజిక్‌ ఇన్‌ ద ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చి అభిమానులతో షేర్ చేసుకున్నారు సునీత. ఇక ఈ వీడియో పై నెటిజన్లు, అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. పోస్ట్ చేసిన క్షణాల్లోనే భారీగా వ్యూస్, లైక్స్ సొంతం చేసుకుంది ఈ వీడియో. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Yuvarathnaa Trailer : ఆకట్టుకుంటున్న యువరత్న ట్రైలర్.. అదరగొట్టిన పునీత్ రాజ్

Sai Pallavi : సమ్మర్ స్పెషల్ గా సాయిపల్లవి .. రెండు సినిమాలతో పలకరించనున్న ఫిదా బ్యూటీ

Deepika Pilli : గుడిలో డ్యాన్స్ లు చేసిన టిక్ టాక్ స్టార్… ఇదేంపనంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..