Sravana Bhargavi: కదిలిస్తున్న శ్రావణ భార్గవి మెసేజ్‌.. ‘అశ్లీలతా.. ధైర్యమా.. అది మీ ఇష్టం’ అంటూ..

Sravana Bhargavi: ఒకపరి.. కీర్తనతో వివాదానికి తెరలేపిన సింగర్ శ్రావణ భార్గవి.. మెట్టు దిగొచ్చింది. తన వీడియో నుంచి ఆ అన్నమయ్య కీర్తనను తీసేశారు. ఆ స్థానంలో మరో మ్యూజిక్ తో వీడియోను అలాగే ఉంచారు. అయితే ఇదంగా బాగానే ఉంది కాని.. తన వీడియోను ఇంతకాలం వివాదస్పదం చేసిన వారికి మాత్రం..

Sravana Bhargavi: కదిలిస్తున్న శ్రావణ భార్గవి మెసేజ్‌.. అశ్లీలతా.. ధైర్యమా.. అది మీ ఇష్టం అంటూ..
Sravana Bhargavi

Updated on: Jul 24, 2022 | 9:30 PM

Sravana Bhargavi: ఒకపరి.. కీర్తనతో వివాదానికి తెరలేపిన సింగర్ శ్రావణ భార్గవి.. మెట్టు దిగొచ్చింది. తన వీడియో నుంచి ఆ అన్నమయ్య కీర్తనను తీసేశారు. ఆ స్థానంలో మరో మ్యూజిక్ తో వీడియోను అలాగే ఉంచారు. అయితే ఇదంగా బాగానే ఉంది కాని.. తన వీడియోను ఇంతకాలం వివాదస్పదం చేసిన వారికి మాత్రం గట్టిగా తన గళం వినిపించిందీ స్టార్ సింగర్. తన యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగానే.. వివాదాస్పదం అయిన తన వీడియో కిందే..! Descriptionలో ఓ మెసేజ్ పెట్టారు. Perspective is everything!! అంటూ అందరి కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది.

‘ఈ ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు.. కోపానికి బదులు మెచ్యురిటీగా ఆలోచించడానికి నాకు చాలా సమయం పట్టింది. నా ప్రతి అడుగును ఆక్షేపించబడినప్పుడు, విమర్శించబడినప్పుడు మౌనంగా ఉండడమే నా సమాధానం అయింది. కాని దాంట్లోనే చాలా శక్తి ఉందని తర్వాతే నాకు అర్థం అయింది. ఇక కొంత మంది నన్ను కిందకు దించాలని ప్రయత్నించినప్పుడు, నేను కూడేసుకున్న ధైర్యమే నన్ను నన్నుగా.. నిజాయితీగా నిలబడేలా చేసింది. ఈ వీడియోలో మీరు అంటున్న అశ్లీలత, అసభ్యత చూస్తారో.. లేక బలం, దయ, శక్తి, ధైర్యం చూస్తారో అది మీ ఇష్టం. కాని చివరగా నేను ఒకటే చెబుతున్నా Perspective is everything! అని తన వీడియో Descriptionలో రాసుకొచ్చింది. ఈ మెసేజ్‌లో అందర్నీ కదిలిస్తోందీ స్టార్ సింగర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..